యూసీసీ బిల్లుకు మధ్యప్రదేశ్ కేబినెట్ ఆమోదం..
యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ) అమలు దిశగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలక ముందడుగేసింది. ఈ మేరకు సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలో ఆదివారం జరిగిన ప్రత్యేక కేబినెట్ సమావేశంలో యూసీసీ బిల్లు ఆమోదం పొందింది. ఈ బిల్లును త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.
కేబినెట్ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. 'రాష్ట్ర చారిత్రక వారసత్వానికి ప్రతీకగా, సమాజంలో సమానత్వాన్ని బలోపేతం చేయాలనే లక్ష్యంతో ఈ నిర్ణయం తీసుకున్నాం' అని తెలిపారు. ఈ బిల్లు అమలుతో దేశంలోని ప్రతి పౌరుడికి సమాన హక్కులు, సమాన అవకాశాలు లభిస్తాయని ఆయన పేర్కొన్నారు. 'మాకు రామ్ అయినా, రహీమ్ అయినా అందరూ ఒక్కటే. అందరికీ ఒకే చట్టం ఉండాలన్నదే ఈ బిల్లు ప్రధాన ఉద్దేశం' అని అన్నారు. ఈ చట్టంతో రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులకు ఎలాంటి భంగం కలగదనీ సీఎం స్పష్టం చేశారు.
అంతకుముందు.. ఈ బిల్లు రూపకల్పన కోసం సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రంజనా ప్రకాశ్ దేశాయ్ అధ్యక్షతన ఓ కమిటీని ఏర్పాటు చేశామని సీఎం తెలిపారు. ఆ కమిటీ రాష్ట్రంలోని అన్ని జిల్లాలు, డివిజన్లలో ప్రజాభిప్రాయాలను సేకరించిందన్నారు. ప్రజాభిప్రాయ సేకరణలో ముస్లింల నుంచీ విశేష మద్దతు లభించిందన్న సీఎం.. ముస్లింలలో సుమారు 80 శాతం మహిళలు, 40 శాతం పురుషులు దీనికి అనుకూలంగా స్పందించారని చెప్పారు. భోపాల్‌లో పలు రాజకీయ పార్టీలు, సామాజిక, మత సంస్థల ప్రతినిధులతోనూ విస్తృత చర్చలు జరిపిందన్నారు. ఈ ప్రక్రియలో ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్), కమ్యూనిస్టు పార్టీలు పాల్గొన్నప్పటికీ.. కాంగ్రెస్ మాత్రం దూరంగా ఉందని సీఎం విమర్శించారు. 'ఒకే దేశం-ఒకే చట్టం అనే భావనను కాంగ్రెస్ ఎప్పటినుంచో వ్యతిరేకిస్తోంది' అని ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ వ్యాఖ్యానించారు.