🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 21 Jul, 2026 | Page: 1

బాచుపల్లి వద్ద కారు బోల్తా..

సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కల్హేర్ మండలం బాచుపల్లి వద్ద ఓ కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ఘటనలో నాలుగేళ్ల చిన్నారి సహా ముగ్గురు దుర్మరణం చెందారు. మరో ఐదుగురు గాయపడ్డారు.
విదేశాల నుంచి వస్తున్న బంధువును తీసుకొచ్చేందుకు నాందేడ్ నుంచి హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. యాక్సిడెంట్ గురించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాలను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రులను నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
🏠 Home