ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ పథకాలు రావు
బీజేపీ, బీఆర్‌ఎస్‌లు చేసిన తప్పులను ప్రశ్నిస్తున్నందుకే తనపై కుట్ర చేస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి ఆరోపించారు. ఆ రెండు పార్టీలు వేరు కావొచ్చు కానీ, వాళ్ల లక్ష్యం మాత్రం ఒక్కటేనని చెప్పారు. తాను ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గ కేంద్రంలో ఓటరు జాబితా సమగ్ర సవరణపై బీఎల్‌ఏలతో నిర్వహించిన సమావేశంలో సీఎం మాట్లాడారు.
ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారు : ప్రతి పేదవాడికి మంచి చేసేందుకు కృషి చేస్తున్నామన్న సీఎం రేవంత్ రెడ్డి, ఈక్రమంలో రోజుకు 18 గంటలు పనిచేసినా సమయం సరిపోవట్లేదన్నారు. కొడంగల్‌లో నేరుగా ఎదుర్కోలేక తనను దెబ్బతీసేందుకు కాంగ్రెస్‌కు ఓట్లు వేసిన వాళ్ల ఓట్లు తొలగించేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో దెబ్బతీస్తే రాష్ట్ర స్థాయికి రాలేడు అని ఆలోచిస్తున్నారని చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 90 శాతం కాంగ్రెస్‌కు ఓట్లు వేస్తారని, వారి ఓట్లు తొలగిద్దామని చూస్తున్నారని ఆరోపించారు. కొడంగల్‌లో 78 శాతం మంది సర్ ప్రక్రియలో పాల్గొన్నారని తెలిపారు. మిగిలిన 22 శాతం ఓట్లు నమోదు చేయించాలని అధికారులకు సూచించారు.
"సర్‌లో కేవలం మైనార్టీల ఓట్లే తొలగిస్తున్నారనే ఒక అపోహ ఉంది. బీజేపీ, బీఆర్ఎస్ వాళ్లు కలిసి ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లు తొలగిస్తున్నారు. ఎందుకంటే ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు 90 శాతం కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తరు, లెక్క గట్టి గంప గుత్తగా తీసి ఈ ఓట్లను బయట పడేసి రేవంత్ రెడ్డి సంగతి చెప్పొచ్చని అనుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయాలని బీజేపీ, బీఆర్‌ఎస్‌లు ఒక్కటై పేదల ఓట్లు తొలగించే ప్రయత్నం చేస్తున్నాయి. ఎందుకంటే ఇక్కడ బీజేపీ ఉన్నది లేదు, ఊడేది లేదు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై మనతో కొట్లాడలని వాళ్ల కుట్ర. పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ వాళ్లే బీజేపీకి ఓట్లు వేయించారు. వీటిన్నింటిని తిప్పి కొట్టాలంటే గ్రామంలో ఉన్న వారి వల్లనే అవుతుంది" -రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి
ఆధారాలు చూపి నమోదు చేసుకోండి : ఓటర్లతో బీఎల్‌ఏలు ఎస్‌ఐఆర్ తప్పకుండా నమోదు చేయించాలన్న సీఎం, ఓటరు జాబితాలో పేరు లేకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలు రావని చెప్పారు. గతంతో పోలిస్తే సరైన వివరాలు లేకపోతే పక్కన పెడతారన్న ఆయన అనుమానాస్పదంగా ఉంటే సరైన ఆధారాలు చూపి ఓటర్లుగా నమోదు చేసుకోవాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో ఓటు వేసే వారి జాబితా ఇప్పుడే నిర్ణయం అవుతోందని, కొడంగల్ నియోజకవర్గంలో అర్హులైన వారి ఓట్లు తొలగించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. ఈనెలాఖరు నాటికి కొడంగల్‌లో 100 శాతం సర్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. తనపై కుట్రలు చేసేవాళ్లను మీరే దెబ్బకొట్టాలని రేవంత్‌రెడ్డి ప్రజలను కోరారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల కాంగ్రెస్ నేతలు, బీఎల్‌ఏలూ ఈ సమావేశానికి హజరయ్యారు.
రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్ట్‌కు నిరసనగా సీఎం రేవంత్ రెడ్డి ర్యాలీ (ETV Bharat)
కాంగ్రెస్ అగ్రనేతల అరెస్టుకు కొడంగల్‌లో సీఎం నిరసన : కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందేనని సీఎం రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. దిల్లీలో మంగళవారం రాహుల్‌గాంధీ, ప్రియాంక గాంధీని అరెస్ట్ చేయడంతో నిరసనగా వికారాబాద్ జిల్లా కొడంగల్‌లో కాంగ్రెస్ శ్రేణులు, నాయకులతో కలిసి సీఎం ధర్నా చేపట్టారు. కొడంగల్‌లోని తన నివాసం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. నీట్ ప్రశ్నాపత్రాలను పల్లీ బఠానీల్లా కోట్ల రూపాయలకు అమ్ముకుని లక్షలాది మంది విద్యార్థుల జీవితాలతో ఆడుకున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దిల్లీ పోలీసులు లాఠీఛార్జ్‌లు, టీయర్‌గ్యాస్ ప్రయోగం, పాశవిక దాడి చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ రక్తం కళ్ల జూసిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదని రేవంత్ రెడ్డి హెచ్చరించారు.
"విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్న కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని దేశం నలుమూలల నుంచి యువకులు దిల్లీ జంతర్ మంతర్‌లో కదం తొక్కి డిమాండ్ చేశారు. నీట్, సీబీఎస్ఈ ప్రశ్నపత్రాల లీక్‌ల గురించి చర్చ జరగకుండా అడ్డుకున్నాడు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ఆందోళన చేస్తున్న విద్యార్థులపై దిల్లీ పోలీసులు లాఠీఛార్జ్‌లు, బాష్పవాయువుతో పాశవిక దాడి చేశారు. రాహుల్‌గాంధీ రక్తం కళ్ల జూసిన కేంద్ర ప్రభుత్వాన్ని వదిలి పెట్టేది లేదు"