ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఏర్పడ్డాయని తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) వ్యాఖ్యానించారు. ఈరోజు (గురువారం) సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఐఓసీ కార్యాలయంలో సిద్దిపేట, కరీంనగర్, హనుమకొండ జిల్లాల కలెక్టర్లు, అధికారులతో ఎల్‌నినో ప్రభావంపై మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఏడు మండలాల అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడారు. గ్రామీణ ప్రాంతాల్లో అధికారులు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలని సూచించారు.
ప్రతి వర్షం చుక్కను కాపాడుకోవాలి..
స్వేచ్ఛగా ఎలాంటి ఒత్తిడి లేకుండా ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. భవిష్యత్తులో తాగునీటికి సంబంధించి ప్రధాన సమస్య వచ్చే అవకాశం ఉందని తెలిపారు. వచ్చే జూన్ వరకు వర్షాలు లేవని శాస్త్రవేత్తలు చెబుతున్నారన్నారు. పశువులకు పశుగ్రాసం ఇబ్బందులు తలెత్తకుండా రైతులకు అవగాహన కల్పించాలని సూచించారు. వ్యవసాయానికి సంబంధించి కరవు పరిస్థితిలో ఆరుతడి పంటలు వేయాలని అన్నదాతలకు సూచిస్తున్నామని అన్నారు.