🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 23 Jul, 2026 | Page: 1

ఇదేం నిర‌స‌న‌రా బాబు.. భాష్ప వాయువు ప్ర‌యోగించిన పోలీసులు..

నీట్ పేప‌ర్ లీకేజీకి వ్య‌తిరేకంగా దేశ‌వ్యాప్తంగా ఆందోళ‌న‌లు జ‌రుగుతున్న సంగ‌తి తెలిసిందే. బిహార్‌లో కూడా బుధ‌వారం వివిధ రాజ‌కీయ ప‌క్షాల‌కు చెందిన విద్యార్థి సంఘాల ఆధ్వ‌ర్యంలో నిర‌స‌న‌లు జ‌రిగాయి. బిహార్ రాజ‌ధాని పాట్నాలో కూడా విద్యార్థులు, యువ‌త భారీ ఎత్తున నిర‌స‌న చేప‌ట్టారు. అయితే, ఈ సంద‌ర్భంగా జ‌రిగిన ప‌రిణామం ఆస‌క్తిక‌రంగా మారింది.
పోలీసులు ఆందోళ‌న‌కారుల‌పై భాష్ప‌వాయువు ప్ర‌యోగిస్తే.. కొంద‌రు విద్యార్థులు దాన్ని రెయిన్ డీజేగా భావించి డ్యాన్స్ చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. బుధ‌వారం విద్యార్థులు పాట్నాలో నీట్ పేప‌ర్ లీకేజీకి వ్య‌తిరేకంగా ఉద్య‌మం చేశారు. ఈ సంద‌ర్భంగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. అయితే, అక్క‌డ ఎండ ప్ర‌భావం ఎక్కువ‌గా ఉంది. విద్యార్థులు ఉక్క‌పోత‌, చెమ‌ట‌తో అల్లాడిపోయారు. దీంతో ఆ విద్యార్థులే.. త‌మ కోసం సిద్ధం చేసిన వాట‌ర్ కెనాన్లు ప్ర‌యోగించాల్సిందిగా పోలీసుల‌ను కోరిన‌ట్లు తెలుస్తోంది. దీంతో పోలీసులు విద్యార్థుల‌పై వాట‌ర్ కెనాన్లు ప్ర‌యోగించారు. ఈ వాట‌ర్ కెనాన్ల ప్ర‌భావానికి అక్క‌డినుంచి వెళ్లిపోవాల్సిన విద్యార్థులు హాయిగా ఆ నీటిలో త‌డిశారు.
🏠 Home