🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 24 Jul, 2026 | Page: 1

అమెరికాలో రోడ్డు ప్రమాదంలో నిర్మల్ యువకుడు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ నిర్మల్ జిల్లాకు చెందిన యువకుడు నిత్యానంద రెడ్డి చికిత్స పొందుతూ మృతిచెందాడు. బ్రెయిన్ డెడ్ కారణంగా అతను మరణించినట్లుగా వైద్యులు తెలిపారు.
నిర్మల్ జిల్లా లక్ష్మణచాంద మండలంలోని నర్సాపూర్ (డబ్ల్యూ) గ్రామానికి చెందిన నిత్యానంద రెడ్డి (26) అమెరికాలో ఎంఎస్ పూర్తి చేశాడు. మిషిగన్ రాష్ట్రంలోని డెట్రాయిట్‌లో నివాసం ఉంటూ అక్కడే ఉద్యోగం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత శనివారం బైక్‌పై బయటకు వెళ్లిన నిత్యానంద రెడ్డిని ఓ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నిత్యాందను అతని స్నేహితులు ఆస్పత్రికి తరలించారు.
🏠 Home