కేటీఆర్ బర్త్‌డే.. మెదక్‌లో చిరు వ్యాపారులకు గొడుగుల పంపిణీ
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్కేటీఆర్ జన్మదినాన్ని పురస్కరిం చుకుని మెదక్ జిల్లా కేంద్రంలో మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. శుక్రవారం మెదక్ పట్టణంలో పెద్ద ఎత్తున పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొని కేటీఆర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కోదండ రామాలయం, వెంకటేశ్వర స్వామి ఆలయాల్లో కేటీఆర్ పేరుపై ప్రత్యేక అర్చనలు, అభిషేకాలు, పూజలు నిర్వహించారు. రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని, తెలంగాణ మరింత అభివృద్ధి చెందాలని, కేటీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
పట్టణంలో నిర్వహించిన ‘గిఫ్ట్ ఏ స్మైల్’ సేవా కార్యక్రమంలో భాగంగా చిరువ్యాపారులకు గొడుగులను పంపిణీ చేశారు. మాజీ డిప్యూటీ స్పీకర్ ఎం. పద్మా దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో కేటీఆర్ పాత్ర ఎంతో కీలకమైందన్నారు. ఐటీ రంగాన్ని ప్రపంచస్థాయికి తీసుకెళ్లడమే కాకుండా పారిశ్రామిక రంగంలో భారీ పెట్టుబడులు తీసుకొచ్చి లక్షలాది మంది యువతకు ఉపాధి అవకాశాలు కల్పించిన దూరదృష్టి కలిగిన నాయకుడు కేటీఆర్ అని కొనియాడారు.