🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 24 Jul, 2026 | Page: 1

నా భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉంది.

ప్రభుత్వ పాఠశాలల్లో పూర్వ వైభవం తీసుకువస్తామని ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) వ్యాఖ్యానించారు. ఈ మేరకు సీఎం చంద్రబాబుకి తాను మాట ఇచ్చానని పేర్కొన్నారు. ఈరోజు (శుక్రవారం) పోలవరం జిల్లా రంపచోడవరంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ హైస్కూలు - జూనియర్ కళాశాలలో విద్యార్థులు, వారి తల్లితండ్రులతో ముఖాముఖి సమావేశంలో లోకేశ్ మాట్లాడారు. రంపచోడవరం ప్రాంతంలో గిరిజనులు కష్టాన్ని నమ్ముకుంటున్నారని తెలిపారు.
ప్రేమ, సేవ, త్యాగం ఉన్నచోట దేవుడు ఉంటారని మంత్రి లోకేశ్ చెప్పుకొచ్చారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులను పిల్లలు గౌరవించాలని సూచించారు. పదోతరగతి, ఇంటర్‌లో ఉత్తమ ఫలితాలు సాదించిన విద్యార్థులు ఫొటోలతో పేపర్ యాడ్ వేశామని ప్రస్తావించారు. విద్యార్థులు బాగా చదవకపోతే ముఖ్యమంత్రి తనను మందలిస్తారని అన్నారు. తన భవిష్యత్తు విద్యార్థులపై ఆధారపడి ఉందని సరదాగా వ్యాఖ్యానించారు. మార్పు మన ఇంటి నుంచే మొదలిపెట్టాలని పిలుపునిచ్చారు.
🏠 Home