🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 27 Jul, 2026 | Page: 1

పరీక్షల సంస్కరణల కోసం- నందన్ నిలేకని నేతృత్వంలో టాస్క్‌ఫోర్స్‌: మోదీ

పరీక్షల నిర్వహణలో సంస్కరణలకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నందన్ నలికేని నేతృత్వంలో హైపవర్ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. విద్యార్థుల భవిష్యత్తు కోసం భారత ప్రభుత్వం నిరంతరం వివిధ చర్యలు తీసుకుంటోందని తెలిపారు. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడిన వారు ఇప్పుడు జైలులో మగ్గుతున్నారని వ్యాఖ్యానించారు. దీని కోసం మేము ఇప్పటికే ఫాస్ట్ ట్రాక్ కోర్టులను కూడా ఏర్పాటు చేశామని చెప్పారు. సోమవారం పార్లమెంట్‌లో కూడా కఠినమైన నిబంధనలతో కొత్త చట్టాన్ని తీసుకువచ్చే దిశగా అడుగులు వేస్తున్నామని ఆయన వెల్లడించారు. ఈ మేరకు మోదీ ఇన్‌స్టాలో వీడియో పోస్టు చేశారు.


"కఠినమైన చట్టపరమైన నిబంధనలతో కూడిన కొత్త చట్టాన్ని పార్లమెంటులో తీసుకువచ్చే దిశగా మేం అడుగులు వేస్తున్నాం. అయితే, మనం భవిష్యత్తు వైపు దృష్టి సారించాలి. మన పరీక్షా విధానం మరింత విశ్వసనీయంగా, పారదర్శకంగా ఉండాలి. అలాగే ఇందులో సాంకేతికతను గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకోవాలి. ఈ అంశాలన్నింటినీ దృష్టిలో ఉంచుకుని, ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన సాంకేతిక నిపుణుడు నందన్ నిలేకని నేతృత్వంలో ఒక అత్యున్నత స్థాయి టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేయాలని మేము నిర్ణయించాం. ఈ టాస్క్‌ఫోర్స్ పరీక్షా విధానంలో తీసుకురావాల్సిన సంస్కరణలపై ప్రధానంగా దృష్టి సారిస్తుంది. వారు ఇచ్చే నివేదిక ఆధారంగా, రానున్న పరీక్షల విశ్వసనీయతను పెంపొందించేందుకు వీలైనంత త్వరగా అవసరమైన చర్యలు తీసుకుంటాం."
🏠 Home