అదుపుతప్పి ఇంటిపై పడిన అమర్‌నాథ్ యాత్రికుల బస్సు..
అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) నుంచి తిరిగివస్తున్న యాత్రికుల బస్సు (Tourists Bus) ప్రమాదానికి గురైంది. ఓ మూల మలుపు వద్ద అదుపుతప్పి సింధు నది (Sindhu River) గట్టున ఉన్న ఇంటిపై పడింది. ఈ ఘటనలో 39 మందికి తీవ్ర గాయాలయ్యాయి. జమ్మూకశ్మీర్ (Jammu and Kashmir) లోని గాందర్‌బల్ జిల్లా (Ganderbal district) కంగన్ ప్రాంతం (Kangan Area) సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. కంగన్ సమీపంలో రహదారిపై మలుపు వద్ద డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
బస్సు అదుపుతప్పి ఇంటిపై పడిన సమయంలో ఆ ఇంట్లో ఎవరూ లేకపోవడంతో వారి ప్రాణాలు దక్కాయి. బస్సు ఇంటి మీద పడటంవల్లే పెనుప్రమాదం తప్పింది. లేదంటే ఫల్టీలు కొడుతూ సింధూ నదిలో పడిపోయేది. దాంతో తీవ్ర ప్రాణ నష్టం సంభవించేది. ప్రమాదంపై సమాచారం అందిన వెంటనే హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్స్ సహాయక చర్యలు చేపట్టాయి.
గాయపడిన యాత్రికులను చికిత్స నిమిత్తం ఆసుపత్రులకు తరలించారు. ఈ ఘటన గురించి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు పెట్టారు. కాగా 3,029 మందితో కొత్త బృందం అమర్‌నాథ్ యాత్రకు బయల్దేరింది. వారంతా మంగళవారం తెల్లవారుజామున జమ్ము నుంచి బయల్దేరారు. జూలై 3న ఈ అమర్‌నాథ్ యాత్ర ప్రారంభంకాగా.. ఆగస్టు 28 వరకు కొనసాగనుంది. సోమవారం నాటికి అమర్‌నాథ్‌లో పూజలు చేసినవారి సంఖ్య 4.22 లక్షల మార్క్‌ను దాటింది.