🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 28 Jul, 2026 | Page: 1

కోయంబత్తూరులో రామ్ చ‌ర‌ణ్ ఆప‌రేష‌న్ పూర్తి..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానులకు ఊరటనిచ్చే వార్త ఒక‌టి బ‌య‌ట‌కు వచ్చింది. కొంతకాలంగా కుడి చేతి మణికట్టు సమస్యతో బాధపడుతున్న రామ్ చరణ్‌కు తమిళనాడులోని కోయంబత్తూరులో ఉన్న ప్రముఖ గంగా హాస్పిటల్‌లో విజయవంతంగా శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని, వైద్యుల పర్యవేక్షణలో వేగంగా కోలుకుంటున్నారని సమాచారం. రామ్ చరణ్‌కు నిర్వహించిన ఈ శస్త్రచికిత్సకు గంగా హాస్పిటల్ చీఫ్, ప్రముఖ ఆర్థోపెడిక్ సర్జన్ డాక్టర్ ఎస్. రాజశేఖరన్ నాయకత్వం వహించారు. ఆయనతో పాటు అంతర్జాతీయ ఖ్యాతి గాంచిన హ్యాండ్ అండ్ రిస్ట్ స్పెషలిస్ట్ డాక్టర్ అలెహాండ్రో బాడియా, డాక్టర్ ప్రవీణ్ భరద్వాజ్ మరియు వారి నిపుణుల బృందం ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసింది.
శస్త్రచికిత్స అనంతరం రామ్ చరణ్ తనకు చికిత్స అందించిన వైద్యులతో కలిసి దిగిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఫొటోను చూసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. వైద్యుల సూచన మేరకు రామ్ చరణ్ మరికొన్ని రోజులు కోయంబత్తూరులోనే విశ్రాంతి తీసుకోనున్నారు. పూర్తిగా కోలుకున్న తర్వాత హైదరాబాద్‌కు తిరిగి రానున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి సంతృప్తికరంగా ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సన్నిహిత వర్గాలు తెలిపాయి.
🏠 Home