రెహమాన్ – హాన్స్ జిమ్మర్ కాంబో క్రేజ్..
బాలీవుడ్ నుంచి రాబోతున్న అంత్యంత ప్రతిష్ఠాత్మాక పౌరాణిక చిత్రం ‘రామాయణం’ (Ramayana) సినిమాకు సంబంధించి రోజుకో కొత్త వార్త అభిమానులను ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన సంగీత హక్కుల వార్తలు బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఈ భారీ బడ్జెట్ చిత్రానికి ఆస్కార్ విజేతలు ఏఆర్ రెహమాన్ (A.R. Rahman), హాలీవుడ్ లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ హాన్స్ జిమ్మర్ (Hans Zimmer) సంయుక్తంగా సంగీతం అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ బిగ్ కాంబో కారణంగా సినిమా మ్యూజిక్ హక్కులపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
చిత్ర నిర్మాతలు ఈ సినిమా సంగీత హక్కుల కోసం దాదాపు రూ.100 కోట్లు డిమాండ్ చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే అంత భారీ ధర పలుకుతుండండంతో పలు మ్యూజిక్ సంస్థలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా మ్యూజిక్ రైట్స్ రేసులో ప్రముఖ ఆడియో కంపెనీ సోని మ్యూజిక్ (Sony Music) సంస్థ సుమారు రూ. 70 కోట్ల బిడ్‌తో ముందువరుసలో నిలిచినట్లు నివేదికలు వెల్లడించాయి.