🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 29 Jul, 2026 | Page: 1

ఓటీటీలోకి త‌మిళ్ బ్లాక్ బస్టర్ ‘గట్టా కుస్తీ 2’..

త‌మిళ టాలెంటెడ్ న‌టుడు విష్ణు విశాల్, కథానాయిక ఐశ్వర్య లక్ష్మి జంటగా నటించిన స్పోర్ట్స్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ ‘గట్టా కుస్తీ 2′(మ‌ట్టి కుస్తీ) డిజిటల్ స్ట్రీమింగ్‌కు సిద్ధమైంది. ఇటీవ‌లే ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చి థియేటర్లలో మంచి స్పందనతో బాక్సాఫీస్ వద్ద విజయవంతంగా ప్రదర్శించబడిన ఈ చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వస్తోంది. ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ హక్కులను దక్కించుకుంది. ఈ క్రమంలోనే సినిమాను జూలై 31 నుంచి ప్రపంచవ్యాప్తంగా అందుబాటులోకి తెస్తున్నట్లు అధికారిక ప్రకటించింది.

🏠 Home