తెలంగాణలో నేడు అతి భారీ వర్షాలు - రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ
వాయుగుండం, ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ రాష్ట్రంలో అతి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉమ్మడి ఆదిలాబాద్‌తో పాటు జగిత్యాల జిల్లాకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఉమ్మడి ఆదిలాబాద్, జగిత్యాల జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ : ఉమ్మడి నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని, ఈ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరికలను జారీ చేసింది. ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్, మెదక్‌తో పాటు హనుమకొండ, జనగామ, వరంగల్, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ, ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను జారీ చేసింది. మిగతా అన్ని జిల్లాల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని తెలిపింది.
ఎల్లంపల్లి ప్రాజెక్టుకు భారీ వరద : తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు విస్తారంగా కురుస్తున్నాయి. దీంతో పలు సాగునీటి ప్రాజెక్టులు, రిజర్వాయర్లకు వరద పోటెత్తుతుంది. అందులో భాగంగానే శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరదనీరు భారీగా చేరుతోంది. ఈ ప్రాజెక్టులో ప్రసుత్తం నీటి నిల్వ 13.93 టీఎంసీలకు చేరుకుంది. వాస్తవానికి నీటి సామర్థ్యం 20 టీఎంసీలు కాగా వరద నీరు వస్తుండటంతో ప్రాజెక్టు నీటిమట్టం 148 మీటర్లకు పెరిగింది. ప్రస్తుతం 145.58 మీటర్లుగా ఉంది. ఇన్‌ఫ్లో 78,034 క్యూసెక్కులు ఉండగా మోటార్లు ఆన్‌చేసి 16,025 క్యూసెక్కులను ఎత్తి పోస్తున్నారు.
మేడిగడ్డ బ్యారేజీకి 1.1 లక్షల క్యూసెక్కుల నీరు : కాళేశ్వరం వద్ద గోదావరి, ప్రాణహిత ఉభయ నదుల ఉద్ధృతి పెరుగుతోంది. సాధారణ పుష్కర ఘాట్, సరస్వతీ పుష్కర ఘాట్ వద్ద జలకళ సంతరించుకుంది. పుష్కర ఘాట్ మెట్ల వద్ద నీటి మట్టం 6.32 మీటర్లకు చేరింది. కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీకి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతుంది. మహారాష్ట్రతో పాటు తెలంగాణలోనూ కురుస్తున్న వర్షాలతో గోదావరిలో ప్రవాహం కొనసాగుతోంది. మేడిగడ్డ బ్యారేజీకి ఎగువ నుంచి 1.1 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా 85 గేట్లు గత మూడేళ్లుగా తెరిచే ఉండటంతో నీరు దిగువకు వెళ్లిపోతుంది. మేడిగడ్డ బ్యారేజీ ఎగువన ఉన్న అన్నారం, సుందిళ్ల ఆనకట్టల గేట్లు కూడా మూడేళ్లుగా తెరిచే ఉన్నాయి.
కడెంకు 42వేల క్యూసెక్కుల వరద : నిర్మల్ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు 42 వేల క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా, ప్రస్తుత నీటిమట్టం 693 అడుగులకు చేరింది.
పలు జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతం : రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా మరో వైపు సూర్యాపేట, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో తీవ్ర లోటు వర్షపాతమున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. సూర్యాపేట 74, నల్గొండ 70, ఖమ్మం 63 శాతం లోటు వర్షపాతం ఉందని పేర్కొంది. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి, భువనగిరి, జనగామ, వరంగల్, నిర్మల్, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూలు, వనపర్తి, గద్వాల జిల్లాల్లో కూడా లోటు వర్షపాతం ఉందని తెలిపింది. ఎల్‌నినో కారణంగా ఈ జిల్లాల్లో జూన్, జులై మాసాల్లో అతి తక్కువగా వర్షాలు కురిశాయి.