బీజేపీకి రాజీనామా చేసిన షెహజాద్ పూనావాలా..
బీజేపీ కీలక నేత, ఆ పార్టీ జాతీయ అధికార ప్రతినిధి షెహజాద్ పూనావాలా బీజేపీకి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో ఆయన తన రాజీనామా సమర్పించినట్లు సమాచారం. ఈ మేరకు బీజేపీ అగ్రనాయకత్వానికి తన రాజీనామా లేఖ అందజేశారు. షెహజాద్ పూనావాలా బీజేపీకి అధికార ప్రతినిధిగా ఉంటూ, టీవీ చర్చల్లో ఆ పార్టీ తరఫున గళం వినిపిస్తుంటారు. అనేక రాజకీయ అంశాల్లో బీజేపీని, మోదీని సమర్ధిస్తూ పార్టీకి అండగా నిలిచారు. ఇటీవల తన సోషల్ మీడియా ఖాతాలో ఆయన రాజకీయ విషయాలు, భవిష్యత్ ప్రణాళికల గురించి వివరించారు.
18, 19 ఏళ్లుగా తాను ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్నానని చెప్పారు. ఇన్నేళ్లుగా తాను అనుకున్నది సాధించానని కూడా తెలిపారు. ‘‘దాదాపు 18-19 ఏళ్లుగా నేను రాజకీయాల్లో ఉన్నాను. చాలా యంగ్ ఏజ్‌లోనే రాజకీయాల్లోకి వచ్చి, ఇప్పటికి దాదాపు 19 ఏళ్లు పూర్తయ్యాయి. రాజకీయాల్లో నేనేం కావాలనుకున్నానో అది సాధించాననే అనుకుంటున్నాను. 2024లో ప్రధాని మోదీ మూడోసారి ప్రధాని అయినప్పుడే నేను రాజకీయాల్లోంచి తప్పుకోవాలని భావించాను’’ అని పూనావాలా తెలిపారు. 2024 తర్వాత తనతోపాటు మరికొందరు కూడా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు చెప్పారు. రాజకీయాల నుంచి తప్పుకొనే ముందు రాబోయే కొన్ని ప్రధాన ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పార్టీ కోసం పని చేయాలని నిర్ణయించుకున్నామన్నారు. తన రాజీనామా అనంతరం పూనావాలా తన ఎక్స్ ఖాతాలో బయో కూడా మార్చుకున్నారు.