రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శ్రీకారం
భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Narendra Modi) ఈరోజు (శనివారం) ప్రారంభించారు. విమానాశ్రయాన్ని ప్రారంభించి జాతికి అంకితం చేశారు. అనంతరం పలు ప్రాజెక్టులకు ప్రధాని శ్రీకారం చుట్టారు. రూ.17,912 కోట్ల అభివృద్ధి ప్రాజెక్టులను ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. రూ.4,727 కోట్లతో భోగాపురం ఎయిర్‌పోర్ట్ నిర్మించారు. విశాఖపట్నం తర్లువాడలో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. సెమీకండక్టర్ ప్యాకేజింగ్, టెస్టింగ్ యూనిట్ తొలిదశకు శ్రీకారం చుట్టారు. రూ.468 కోట్ల వ్యయంతో ASIP సెమీకండక్టర్ ప్రాజెక్టును ప్రారంభించారు.