సినీ ఇండస్ట్రీలో విషాదం..
హాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ నటుడు విన్సెంట్ పాస్టోర్ 80 ఏళ్ల వయసులో కన్నుమూశారు. హెచ్‌బీఓ రూపొందించిన ప్రపంచ ప్రఖ్యాత క్రైమ్ డ్రామా సిరీస్ ది సోప్రానోస్ లో సాల్వటోర్ ‘బిగ్ పసీ’ బోన్పెన్సియెరో పాత్రతో ఆయన అంతర్జాతీయ గుర్తింపు పొందారు. ఆయన మరణవార్త అభిమానులతో పాటు హాలీవుడ్ సినీ వర్గాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. తాజా సమాచారం ప్రకారం, విన్సెంట్ పాస్టోర్ తన బ్రాంక్స్ నివాసంలో మృతిచెందినట్లు అధికారులు గుర్తించారు. కొన్ని రోజులుగా ఆయన కనిపించకపోవడంతో పొరుగువారు అధికారులకు సమాచారం ఇవ్వగా, అనంతరం ఆయన మృతదేహాన్ని గుర్తించినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన మరణానికి గల కారణాలపై అధికారులు విచారణ చేపట్టగా, అధికారికంగా మరణ కారణాన్ని ఇంకా వెల్లడించలేదు.
విన్సెంట్ పాస్టోర్ మరణవార్త తెలిసిన వెంటనే ఆయనతో కలిసి పనిచేసిన నటులు, సన్నిహితులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా నివాళులు అర్పిస్తున్నారు. ముఖ్యంగా ది సోప్రానోస్ లో సహనటుడిగా నటించిన మైఖేల్ ఇంపెరిఓలీ భావోద్వేగ సందేశంతో ఆయనను స్మరించుకున్నారు. తన ఇన్‌స్టాగ్రామ్‌లో విన్సెంట్‌తో కలిసి దిగిన పాత ఫోటోను పంచుకున్న మైఖేల్, మన ప్రియమైన మిత్రుడు, సహచరుడిని కోల్పోవడం చాలా బాధాకరం అంటూ నివాళి అర్పించారు. అమెరికా, ఇటలీ, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో కలిసి పర్యటించిన అనేక మధుర జ్ఞాపకాలను గుర్తుచేసుకుంటూ, విన్సెంట్ ఎంతో పెద్ద మనసున్న వ్యక్తి. ఆయనను జీవితాంతం మిస్ అవుతాను అని పేర్కొన్నారు.