🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 03 Aug, 2026 | Page: 1

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో మరో కోణం..

ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసు విచారణలో తవ్విన కొద్దీ విస్మయపరిచే విషయాలు బయటపడుతున్నాయి. అతడికి మరో మహిళతోనూ సన్నిహిత సంబంధాలున్నట్టు పోలీసులు గుర్తించారు. 2014లో వివాహమైన మరో మహిళతో సన్నిహిత సంబంధం నడిపినట్లు ఆధారాలు సుకరించారు. ఉదయ్ కృష్ణారెడ్డి గదినుంచి ప్రేమలేఖలను స్వాధీనం చేసుకున్నారు. అశోక్‌నగర్‌లోని ఉదయ్ రూమ్‌లో క్రైమ్ సీన్ రీకన్‌స్ట్రక్షన్‌ చేసిన పోలీసులు రెండు ప్రేమలేఖలు, ల్యాప్‌టాప్, ఫోన్, కత్తి స్వాధీనం చేసుకున్నారు. ఏపీకి చెందిన వివాహితతో అతడికి సాన్నిహిత్యం ఉన్నట్టు గుర్తించారు.
🏠 Home