ఎవరైనా రాజీనామా చేస్తే.. క్షణాల్లో ఆమోదిస్తా..
కర్నాటక సీఎం డీకే శివకుమార్(DK Shivakumar).. అసంతృప్తి ఎమ్మెల్యేలకు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఎవరైనా రాజీనామా చేస్తే, వారి రాజీనామాను క్షణాల్లో ఆమోదించనున్నట్లు చెప్పారు. సోమవారం సుమారు 20 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే కొత్త కేబినెట్‌లో మంత్రి పదవి దక్కని కొందరు ఎమ్మెల్యేలు అసంతృప్తితో చెలరేగిపోతున్నారు. ఇద్దరు ఎమ్మెల్యేలు రాజీనామా చేసినట్లు కూడా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం డీకే శివకుమార్ తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఎవరైనా ఎమ్మెల్యే రాజీనామా చేస్తే దాన్ని క్షణాల్లో ఆమోదిస్తానన్నారు. కానీ దానికి ముందు వారితో వ్యక్తిగతంగా మాట్లాడనున్నట్లు చెప్పారు.