🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 07 Aug, 2026 | Page: 1

సీఎం విజ‌య్ విడాకుల కేసులో కీల‌క మ‌లుపు..

తమిళనాడు రాజకీయ మరియు సినీ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిన ముఖ్యమంత్రి విజయ్ (Joseph Vijay) కుటుంబ వివాదానికి సంబంధించి ఒక ముఖ్యమైన పరిణామం వెలుగులోకి వచ్చింది. సీఎం విజయ్ సతీమణి సంగీత, చెంగల్పట్టు జిల్లా కుటుంబ న్యాయస్థానంలో గతంలో దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను అధికారికంగా వెనక్కి తీసుకున్న‌ట్లు తెలుస్తుంది. సంగీత తన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు న్యాయస్థానానికి తెలపడంతో, ఇరువర్గాల వాదనలను పరిశీలించిన చెంగల్పట్టు డిస్ట్రిక్ట్ కోర్టు ఈ కేసుకు సంబంధించి తుది ఉత్తర్వులు వెలువరించింది. పిటిషన్ ఉపసంహరణను పరిగణలోకి తీసుకున్న న్యాయస్థానం, ఈ విడాకుల కేసుకు సంబంధించి ప్రొసీడింగ్స్‌ను పూర్తిగా ముగిస్తున్నట్లు (Disposed of) ప్రకటించింది.
🏠 Home