🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 13 Aug, 2026 | Page: 1

ఎర్రకోట పేలుళ్ల వెనుక అల్‌ఖైదా..

దేశ రాజధాని ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో 2025 నవంబర్‌లో జరిగిన పేలుడికి అల్‌ఖైదా అనుబంధ సంస్థ ‘అల్‌ఖైదా ఇన్‌ ద ఇండియన్‌ సబ్‌కాంటినెంట్‌’ (ఏక్యూఐఎస్‌) కారణమని ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి (యూఎన్‌ఎస్సీ) అధికారికంగా పేర్కొంది. ఆగస్టు 10న విడుదలైన యూఎన్‌ఎస్సీ విశ్లేషణాత్మక సహాయ, ఆంక్షల పర్యవేక్షణ బృందం తన నివేదికలో ఈ విషయాన్ని వెల్లడించింది.2025 నవంబర్‌ 10న రాత్రి 7 గంటల సమయంలో ఎర్రకోట సమీపంలో కదులుతున్న హ్యుందాయ్‌ ఐ20 కారులో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. కారును ఉమర్‌-ఎ-నబీ నడిపినట్లు దర్యాప్తులో గుర్తించారు. అతడే ఆత్మాహుతి దాడికి పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.ఈ దాడిని తొలుత పాకిస్థాన్‌ కేంద్రంగా ఉన్న జైష్‌-ఎ-మొహమ్మద్‌ (జేఈఎం) అని అయి ఉంటుందని అనుమానించారు. ఓ సభ్య దేశం కూడా వరుస దాడులతో పాటు రెడ్‌ఫోర్ట్‌ పేలుడికి జేఈఎం కారణమని పేర్కొన్నట్లు యూఎన్‌ఎస్సీ నివేదిక తెలిపింది. తాజాగా ఏక్యూఐఎస్‌కు అధికారికంగా ఆపాదించడం ఈ కేసులో కీలక పరిణామంగా మారింది.
🏠 Home