🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 13 Aug, 2026 | Page: 1

మధ్యప్రదేశ్ గ్రామాల్లో వందలాది పిల్లలకు అనారోగ్యం..

మధ్యప్రదేశ్‌లోని పలు గ్రామాల పిల్లలు అనారోగ్యం బారిన పడుతున్నారు. అంతుపట్టని వ్యాధుల కారణంగా ఇప్పటి వరకు 8 మంది పిల్లలు మరణించారు.దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. మధ్యప్రదేశ్‌లోని బాలాఘాట్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. మచ్ఛుర్దా, అడోరి, బొండరి, కోర్కా, కుండెకాస గ్రామాల పిల్లలు గత 40 రోజులుగా తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారు. మలేరియా, టైఫాయిడ్, ఫంగల్, చర్మ వ్యాధులు, గజ్జి, తట్టు, జ్వరం, జలుబు, దగ్గు, డీహైడ్రేషన్ వంటి సమస్యలతో బాధపడుతున్నారు. బైగా ప్రజలు అధికంగా నివసించే ఈ గ్రామాలలో జూన్ 26 నుంచి ఇప్పటి వరకు ఎనిమిది మంది పిల్లలు మరణించారు. వందలాది మంది ఆసుపత్రిపాలయ్యారు.
🏠 Home