🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 13 Aug, 2026 | Page: 1

నల్సార్ 2026 న్యాయ విద్యార్థులపై బార్ కౌన్సిల్ కీలక నిర్ణయం..

హైదరాబాద్‌లోని నల్సార్ న్యాయ విశ్వవిద్యాలయం 2026 బ్యాచ్ విద్యార్థులకు సంబంధించి బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2026లో నల్సార్ నుంచి న్యాయ పట్టా పొందిన విద్యార్థులను తదుపరి ఆదేశాలు వచ్చే వరకు న్యాయవాదులుగా నమోదు చేయవద్దని అన్ని రాష్ట్రాల బార్ కౌన్సిళ్లను బీసీఐ ఆదేశించిందినల్సార్ విశ్వవిద్యాలయం స్నాతకోత్సవానికి భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించడంపై కొందరు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేశారు. 2026లో పట్టా పొందనున్న విద్యార్థులతో పాటు ఇతర బ్యాచ్‌లకు చెందిన విద్యార్థులు కూడా ఈ అభ్యంతరాలకు మద్దతు తెలిపినట్లు సమాచారం. ఇటీవల ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద జరిగిన నిరసనలకు సంబంధించి సీజేఐ చేసిన వ్యాఖ్యలే విద్యార్థుల అభ్యంతరాలకు కారణంగా నిలిచాయి. ఈ నేపథ్యంలో బీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది .
🏠 Home