🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 15 Aug, 2026 | Page: 1

మొబైల్‏తో ఈ-కేవైసీ చేసుకోండిలా..

వాంకిడి(మంచిర్యాల): గ్యాస్ ఈ- కేవైసీ ని మొబైల్‌తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎల్‌పీజీ వంట గ్యాస్‌ వినియోగంలో అక్రమాలకు చెక్‌ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశ పెట్టారు. ఇన్నేళ్లు గడిచినా.. ఇప్పటికీ చాలా మంది ఈ ప్రక్రియ పూర్తి చేయలేదు. వినియోగదారులు ఆగస్టు 16 లోపు పూర్తి చేయాలని పౌర సరఫరాల శాఖ ఉత్త ర్వులు జారీ చేసింది. ఇంటి వద్దనే ఫోన్‌లో యాప్‌ ద్వారా చేసుకునే వెసులుబాటును ఏజెన్సీలు కల్పించాయి. కనెక్షన్లను ఆధార్‌తో అనుసంధానం చేయడంతో పాటు ముఖ గుర్తింపు, వేలి ముద్రలు, ఐరిస్‌ వంటి మూడు విధానాలతో ఎల్‌పీ వినియోగదారులు ఈ-కేవైసీని పూర్తి చేయవచ్చు.
🏠 Home