🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 14 Jun, 2026 | Page: 1

పాక్తో చర్చలకు తలుపులు తెరిచే ఉంచాలి'- హోసబాలే వ్యాఖ్యలకు మద్దతుగా RSS చీఫ్

పాకిస్థాన్‌తో చర్చల కోసం తలుపులు తెరిచే ఉంచాలంటూ రాష్ట్రీయ స్వయం సేవక్‌ సంఘ్‌ (ఆర్ఆర్ఎస్) ప్రధాన కార్యదర్శి దత్తాత్రేయ హోసబాలే చేసిన వ్యాఖ్యలను ఆ సంస్థ చీఫ్‌ మోహన్ భాగవత్ సమర్థించారు. దేశ విభజన జరగడం తప్పని భావించే వారు పాకిస్థాన్‌లో చాలా మంది ఉన్నారని మోహన్ భాగవత్ అన్నారు. రెండు దేశాల సిద్ధాంతానికి వ్యతిరేకంగా, అంతా కలిసి జీవిద్దామనే భావన అక్కడి ప్రజల్లో అంతర్లీనంగా ఉందని అభిప్రాయపడ్డారు. అయితే పాకిస్థాన్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ విదేశాంగ విధానాన్నే ఆర్ఆర్ఎస్ అనుసరిస్తుందని స్పష్టంచేశారు. శనివారం కేరళలోని తిరుపునంతపురంలో జరిగిన ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా శనివారం నిర్వహించిన ఒక సమావేశంలో మాట్లాడుతూ ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.
🏠 Home