ఎనిమిదో రోజుకు చేరిన జ్ఞానేశ్వరి గాలింపు - డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆదేశాలు
కాకినాడ జిల్లా తుని మండలం సీహెచ్ అగ్రహారంలో అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి జ్ఞానేశ్వరి కేసు మిస్టరీగా మారింది. చిన్నారి ఆచూకీ కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటికీ ఎలాంటి ఆధారం లభించలేదు. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు శునకం మృతి చెందడంతో దర్యాప్తు మరింత క్లిష్టంగా మారింది. కిడ్నాప్ కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. చిన్నారి ఆచూకీ కోసం మరిన్ని బృందాలను రంగంలోకి దించాలని తాజాగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆదేశించారు. ఈ మేరకు కాకినాడ జిల్లా ఎస్పీ బిందుమాధవ్‌తో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం గాలింపు చర్యల్లో పాల్గొంటున్న పోలీసు, ఎస్‌డీఆర్‌ఎఫ్‌తో పాటు ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాల సేవలూ వినియోగించుకోవాలని సూచించారు. దట్టమైన అడవుల్లోకి వెళ్లగలిగే నిపుణుల సహాయం తీసుకుని, పరిసర ప్రాంతాల్లో జల్లెడ పట్టాలన్నారు.
అసలేం జరిగిందంటే : కాకినాడ జిల్లా తుని మండలం దొండవాక పంచాయతీ సీహెచ్ అగ్రహారంలో ఈ నెల 6న అదృశ్యమైన రెండేళ్ల చిన్నారి సుంకర జ్ఞానేశ్వరి జాడ ఇప్పటికీ లభించలేదు. ఆచూకీ కోసం పోలీసులు ఎనిమిది రోజులుగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. ఎవరైనా అపహరించి, ప్రధాన మార్గంలో కాకుండా కొండ ప్రాంతం నుంచి తీసుకెళ్లి ఉండవచ్చనే కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. బాలిక తండ్రి గణేష్‌కు ఎవరితోనైనా వివాదాలున్నాయా అని పరిశీలిస్తున్నారు. ఈ కేసులో కీలకంగా భావించిన పెంపుడు కుక్క శనివారం మధ్యాహ్నం ప్రాణాలు విడిచింది.