వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు - విజయవాడలో DMDC ఏర్పాటు
రాష్ట్రంలో వ్యాధుల వ్యాప్తిని ముందుగానే గుర్తించి సమర్థంగా నియంత్రించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. ఇందుకోసం 'డిసీజ్ మానిటరింగ్ అండ్ డెసిషన్ మేకింగ్ సెంటర్' (డీఎండీసీ)ను విజయవాడలోని డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేస్తోంది. కృత్రిమ మేధస్సు (ఏఐ) ఆధారిత సాంకేతికతతో పనిచేసే ఈ కేంద్రం ద్వారా వ్యాధులపై ముందస్తు హెచ్చరికలు అందించి, సమయానుకూల నిర్ణయాలు తీసుకునే అవకాశాలు మెరుగుపడనున్నాయి.
డీఎండీసీ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం : డీఎండీసీ ఏర్పాటుకు తొలి ఏడాది రూ.5.73 కోట్ల వ్యయం అంచనా వేయగా, అనంతరం ప్రతి ఏడాది రూ.3.7 కోట్ల చొప్పున ఖర్చు చేయనున్నారు. ఈ కేంద్రానికి డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నోడల్ ఏజెన్సీగా వ్యవహరించనుంది. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి నేతృత్వంలోని స్టీరింగ్ కమిటీ కేంద్రం పనితీరును పర్యవేక్షిస్తూ ఫలితాలను సమీక్షించనుంది.
ఏఐతో వ్యాధుల అంచనా, విశ్లేషణ : ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వెలెన్స్ ప్రోగ్రాం (ఐడీఎస్‌పీ) ఆధారంగా ఈ కేంద్రం పని చేయనుంది. రాష్ట్రంలోని ఆసుపత్రులకు వచ్చే కేసులు, వాటి ప్రాంతాల వారీ వివరాలు, వ్యాధుల వ్యాప్తి ధోరణులను ఏఐ సాంకేతికతతో విశ్లేషిస్తారు. సాంక్రమిక, అసాంక్రమిక వ్యాధులతో పాటు ఇతర ఆరోగ్య సమస్యలకు సంబంధించిన సమాచారాన్ని సమగ్రంగా సేకరించి ప్రభుత్వానికి క్షేత్రస్థాయి పరిస్థితులను నివేదిస్తారు.