🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 15 Jun, 2026 | Page: 1

అన్ని ఫ్రాంచైజీలు టైటిల్ గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా కసరత్తు - తొలి మ్యాచ్​ పాలమూరు స్ట్రైకర్స్‌తో ఖమ్మం ఏసెస్ - క్రేజ్ పెంచేందుకు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో డ్రోన్ షో ఏర్పాటు

హైదరాబాద్‌లో ఐపీఎల్​ తరహాలో క్రికెట్ సందడి మొదలుకానుంది. యువ ప్రతిభను వెలికి తీయడంతో పాటు తెలంగాణ క్రికెట్‌కు కొత్త ఉత్సాహం తీసుకురావాలనే లక్ష్యంతో హెచ్​సీఏ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ప్రారంభానికి రంగం సిద్ధమైంది. జట్ల ఎంపిక, ప్లేయర్ల వేలం ఇప్పటికే పూర్తి కాగా, ప్రాక్టీస్ సెషన్లతో క్రికెట్ హవా కనిపిస్తోంది. అన్ని ఫ్రాంచైజీలు టైటిల్ గెలుపే లక్ష్యంగా ముమ్మరంగా కసరత్తు చేస్తున్నాయి.

మొదలైన ప్రాక్టీస్​ సెషన్లు : హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న టీజీ-20 లీగ్ ఈ నెల 21 నుంచి ప్రారంభం కానుంది. ఐపీఎల్​ తరహాలో రూపొందించిన టోర్నీలో యువ ఆటగాళ్లు ప్రతిభను నిరూపించుకోనున్నారు. ఇప్పటికే ఆటగాళ్ల వేలం పూర్తి కాగా, అన్ని జట్లు ప్రాక్టీస్‌ సెషన్లు మొదలుపెట్టాయి. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ డ్రిల్స్‌తో ఆటగాళ్లు సాధన చేస్తున్నారు. కోచ్‌లు, సపోర్ట్ స్టాఫ్ పర్యవేక్షణలో మ్యాచ్ పరిస్థితులకు అనుగుణంగా ప్రాక్టీస్ చేస్తున్నారు. లీగ్​కు మరింత క్రేజ్ తెచ్చేందుకు టీజీ
🏠 Home