🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

సర్ ప్రక్రియ​పై నిర్లక్ష్యం వహిస్తే తీవ్ర నష్టం - అప్రమత్తంగా ఉండాలి : సీఎం రేవంత్ రెడ్డి

ప్రతి ఓటును కాపాడుకోవడం ప్రజాస్వామ్య పరిరక్షణలో కీలక బాధ్యతని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. అనుమానాస్పద ఓట్ల పేరిట భారీ ఎత్తున తొలగింపునకు అవకాశం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. సర్‌ విషయంలో ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సూచించారు. ఓట్లను తొలగిస్తే రాజకీయంగా ప్రమాదకర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఓటు హక్కు పరిరక్షణ ధ్యేయంగా పనిచేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నవే తొలగింపు! : తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ- సర్‌ ప్రక్రియను ఆషామాషీగా తీసుకోవద్దని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. రాష్ట్రంలోని మొత్తం బీజేపీకి వ్యతిరేకమైన ఓట్లను వివిధ కారణాలతో పక్కనపెట్టి, అనుమానాస్పద ఓట్ల పేరుతో తొలగించే ప్రయత్నాలు జరిగే అవకాశం ఉందని రేవంత్‌రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. 2028 ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితా 2026 అక్టోబర్ నాటికే తుదిరూపం దాల్చుతుందని ఒకసారి ఓటు తొలగిపోతే తర్వాత దాన్ని సరిదిద్దుకునే అవకాశం చాలా పరిమితంగా ఉంటుందని సీఎం హెచ్చరించారు.
🏠 Home