🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

ఫ్లాగ్‌షిప్ ఫోన్లలో ఒప్పో సంచలనం..

| ప్రీమియం స్మార్ట్‌ఫోన్ విభాగంలో పోటీగా ఒప్పో కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్‌ను సిద్ధం చేస్తోంది. త్వరలోనే Oppp Find X10 Pro మొబైల్‌ను తీసుకురాబోతుంది. ఈ క్రమంలో ఈ ఫోన్‌కు సంబంధించిన కీలక వివరాలు లీకయ్యాయి. దీనిప్రకారం ఈ మొబైల్ డ్యూయల్ 200మెగాపిక్సెల్ కెమెరాలు, భారీ బ్యాటరీతో పాటు ఆసక్తికరమైన ఫీచర్లతో ఈ మొబైల్ వస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రముఖ టిప్‌స్టర్ డిజిటల్ చాట్ స్టేషన్ చైనా సోషల్‌మీడియా వేదిక వీబోలో వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఒప్పో ప్రస్తుతం ఈ ఫోన్‌కు సంబంధించిన ఇంజినీరింగ్ మోడల్‌ను పరీక్షిస్తున్నట్లు తెలుస్తోంది. టిప్‌స్టర్ ఫోన్ పేరును నేరుగా ప్రస్తావించకపోయినా.. గతంలో వెలుగులోకి వచ్చిన వివరాలు, తాజా వ్యాఖ్యలను పోల్చి చూడగా ఇది Oppo Find X10 Pro అనే టెక్ నిపుణులు భావిస్తున్నారు.

లీకైన సమాచారం ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 6.78 అంగుళాల LTPO డిస్‌ప్లేను అందించే అవకాశం ఉంది. 1.5K రిజల్యూషన్, అత్యంత పలుచటి బెజెల్స్, గుండ్రని మూలాలతో ప్రీమియం డిజైన్‌ను అందించనున్నట్లు సమాచారం. అలాగే న్యూ జనరేషన్ టియాన్‌మా డిస్‌ప్లే సబ్‌స్ట్రేట్‌ను కూడా ఇందులో ఉపయోగిస్తున్నట్లు తెలుస్తోంది.

కెమెరాలే ప్రధాన ఆకర్షణ
Oppo Find X10 ప్రోలో కెమెరా విభాగం అత్యంత ప్రత్యేకంగా ఉండే అవకాశం ఉందని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇందులో 1/1.3 అంగుళాల సైజ్ గల 200మెగాపిక్సెల్ శాంసంగ్ ISOCELL HPC ప్రైమరీ సెన్సార్‌ను ఉపయోగించినట్లు సమాచారం. దీనికి తోడు మరో 200 మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరాను కూడా అందించనున్నట్లు లీకులు పేర్కొన్నాయి. అదనంగా 3మెగాపిక్సెల్ మల్టీస్పెక్ట్రల్ లెన్స్ కూడా ఉండొచ్చని తెలుస్తోంది.

ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న Find X9 ప్రోలో 50 మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా, 50మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 200మెగాపిక్సెల్ టెలిఫొటో కెమెరా ఉన్నాయి. దీన్నిబట్టి చూస్తే కొత్త మోడల్‌లో కెమెరాల కెపాసిటీ చాలా మెరుగ్గా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి.

భారీ బ్యాటరీ, వైర్‌లెస్ చార్జింగ్
Find X10 Proలో 8000mAh లేదా అంతకంటే ఎక్కువ సామర్థ్యం గల బ్యాటరీ ఉండొచ్చని సమాచారం. ఇది వైర్‌లెస్ చార్జింగ్‌కు కూడా సపోర్టు చేస్తుంది. ఇది Find X9 Proలో ఉన్న 7500mAh బ్యాటరీతో పోలిస్తే గణనీయమైన అప్‌గ్రేడ్‌గా భావిస్తున్నారు.

2 నానోమీటర్ చిప్‌సెట్
పనితీరుపరంగా ఈ ఫోన్‌లో అత్యాధునిక 2nm మీడియాటెక్ డైమెన్సిటీ ప్రాసెసర్ ఉండొచ్చని లీకుల ద్వారా తెలుస్తోంది. ఇది రాబోయే డైమెన్సిటీ 960 చిప్‌సెట్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అదనంగా 3డీ అల్ట్రాసోనిక్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్, IP68, IP69 రేటింగ్‌లతో వచ్చే అవకాశం ఉంది.
🏠 Home