🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

అమెరికా వేదిక‌పై పోరాడిన ఇరాన్‌..

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌ లో న్యూజిలాండ్‌, ఇరాన్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ 2-2 గోల్స్ తేడాతో డ్రాగా ముగిసింది. రెండు సార్లు ఇరాన్ ఓట‌మి నుంచి త‌ప్పించుకున్న‌ది. కివీస్ ప్లేయ‌ర్ ఈ జ‌స్ట్ త‌మ జ‌ట్టు త‌ర‌పున రెండు గోల్స్ చేశాడు. తొలుత ఏడ‌వ నిమిషంలో, ఆ త‌ర్వాత 54 నిమిషంలో గోల్స్ చేశాడు. అయితే ఇరాన్ కూడా గ‌ట్టిగా కౌంట‌ర్ ఇచ్చింది. కీల‌కమైన ద‌శ‌లో గోల్స్ చేసింది. 32, 64 నిమిషాల‌ప్పుడు ఇరాన్ గోల్స్ చేసి కివీస్‌ను నిలువ‌రించింది. అమెరికాతో యుద్ధం చేస్తున్న ఇరాన్‌.. వాస్త‌వానికి ఈ టోర్నీ ముందు అమెరికాలో ఆడేందుకు నిరాక‌రించింది. గ్రూప్ స్టేజ్‌లో మ్యాచ్‌ల‌ను మ‌రో ప్ర‌దేశానికి త‌ర‌లించాల‌ని ప‌ట్టుప‌ట్టింది. కానీ ఫిఫా ఆ అభ్య‌ర్థ‌న‌ను తిర‌స్క‌రించింది. త‌న శిక్ష‌ణ కేంద్రాని ఆరిజోనా నుంచి మెక్సికోలోని టిజునాకు మార్చుకున్న‌ది. రెండు సార్లు వెనుక‌బ‌డ్డ ఇరాన్ ఈ మ్యాచ్‌లో అద్భుతంగా రాణించింది. గ్రూప్ జీలో బెల్జియం, ఈజిప్ట్ మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్ 1-1 గోల్స్ తేడాతో డ్రా అయ్యింది.
🏠 Home