🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం : మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర ప్రియాంక

వరంగల్ ,జూన్ 16 సుదీక్ష న్యూస్:
వరంగల్ ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర ప్రియాంకను మంగళవారం తెలంగాణ రైతు సంఘం నాయకులు కలిసి రైతులు ఎదుర్కొంటున్న పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రైతు సంఘం అధ్యక్షుడు సోమిడి శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఓదెల రాజయ్య ఆధ్వర్యంలో పలువురు రైతు నాయకులు మార్కెట్ కమిటీ కార్యాలయంలో చైర్మన్‌ను కలిసి సమస్యలను వివరించారు.
ఈ సందర్భంగా రైతులు తమ పంటలను విక్రయించే సమయంలో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, తాగునీటి సౌకర్యం, రైతుల కోసం విశ్రాంతి భవనాల ఏర్పాటు, మరుగుదొడ్ల నిర్మాణం, ఉచిత భోజన వసతి, పంటల నాణ్యత నిర్ధారణ, రోజువారీ పంటల ధరలను ఎలక్ట్రానిక్ డిస్‌ప్లే బోర్డుల ద్వారా ప్రదర్శించడం వంటి అంశాలను ప్రస్తావించారు. అదేవిధంగా వరంగల్ నగరంలోని లక్ష్మీపురం వద్ద పండ్ల మార్కెట్ నిర్మాణాన్ని వేగవంతం చేయాలని కోరారు.
రైతుల సమస్యలను విన్న మార్కెట్ కమిటీ చైర్మన్ ఎర్ర ప్రియాంక సానుకూలంగా స్పందిస్తూ, సంబంధిత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏠 Home