🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

మున్సిపల్ కార్మికుల సమస్యల పరిష్కారానికి ఆందోళన కార్యక్రమాలు విజయవంతం చేయాలి: సీఐటీయూ నాయకులు

కాజీపేట, జూన్ 16 (సుదీక్ష న్యూస్): తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మున్సిపల్ కార్మికుల కనీస వేతనాన్ని రూ.26,000కు పెంచాలని, మున్సిపల్ కార్మికులందరినీ శాశ్వత ఉద్యోగులుగా నియమించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న ఆందోళన కార్యక్రమాలను విజయవంతం చేయాలని సీఐటీయూ మున్సిపల్ యూనియన్ నాయకులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో వారు మాట్లాడుతూ, జూన్ 1 నుంచి 15వ తేదీ వరకు కార్మికులచే సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించామని తెలిపారు. జూన్ 18, 19 తేదీలలో కార్పొరేషన్, మున్సిపల్ కార్యాలయాల ఎదుట నిరాహార దీక్షలు చేపట్టనున్నట్లు వెల్లడించారు. అలాగే జూన్ 22న జిల్లా కలెక్టర్ కార్యాలయాల ముందు ధర్నాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.
ముఖ్యమంత్రి దృష్టికి సమస్యలను తీసుకెళ్లేందుకు జూన్ 29, 30 తేదీలలో ఎమ్మెల్యేలు, మంత్రుల నివాసాలు మరియు క్యాంపు కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం జూలై 12న హనుమకొండ జిల్లా కేంద్రంలో జరిగే సీఐటీయూ మున్సిపల్ యూనియన్ రాష్ట్ర సమావేశంలో తదుపరి కార్యాచరణను ప్రకటిస్తామని చెప్పారు.
రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు చేపట్టనున్న అన్ని దశల ఆందోళన కార్యక్రమాల్లో మున్సిపల్ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని హనుమకొండ జిల్లా సీఐటీయూ మున్సిపల్ యూనియన్ అధ్యక్షులు రోంటాల కోటేశ్వర్ పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో వెంకటస్వామి, మల్లయ్య, సురేందర్, చంద్రమౌళి, రవీందర్, అనిల్, అనుదీప్, భాస్కర్, వర్ధన్, సుధాకర్, సునీల్, అశోక్, శ్యాంసుందర్, రమేష్ తదితర నాయకులు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని కార్మికులకు విజ్ఞప్తి చేశారు.
🏠 Home