🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

ఖమ్మం బాలికపై అత్యాచారం ఘటనకు నిరసనగా వరంగల్‌లో రజక సంఘాల ర్యాలీ

వరంగల్, జూన్ 16 సుదీక్ష న్యూస్ : ఖమ్మం జిల్లాలో 12 ఏళ్ల రజక బాలికపై జరిగిన అత్యాచారం, హత్యాయత్నం ఘటనను ఖండిస్తూ తెలంగాణ రజక సంఘాల సమితి ఆధ్వర్యంలో మంగళవారం వరంగల్‌లో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. వరంగల్ హెడ్ పోస్ట్ ఆఫీస్ నుంచి చౌరస్తా వరకు ర్యాలీగా సాగిన సంఘ నాయకులు, సభ్యులు బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బాలికపై అత్యాచారం చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితుడు ఎండి గౌస్ పాషాపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో వేగవంతంగా విచారణ జరిపి కఠిన శిక్ష, మరణదండన విధించాలని కోరారు. రాష్ట్రంలో రజకులపై జరుగుతున్న దాడులను అరికట్టేందుకు అట్రాసిటీ చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి రజకులకు తగిన రక్షణ కల్పించాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో తెలంగాణ రజక సంఘాల సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూతనకంటి ఆనందం, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చిట్యాల భిక్షపతి, ఐఎంఎఫ్ అధ్యక్షుడు డాక్టర్ చల్లగురుగుల దళపతి, ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి బస్వరాజు రాజ్‌కుమార్, వరంగల్ జిల్లా కార్యదర్శి కొత్తకొండ శ్రీనివాస్, హనుమకొండ జిల్లా ఉపాధ్యక్షుడు శనిగరం శ్రీధర్, మాజీ కార్పొరేటర్ బస్వరాజు కుమార్, జిల్లా నాయకులు భోగి సురేష్, దొడ్డిపాటి శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
నిరసనకారులు నిందితుడిపై తక్షణ చర్యలు తీసుకుని బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని నినాదాలు చేశారు.
🏠 Home