🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 16 Jun, 2026 | Page: 1

ప్రజా సమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులే


గుడిసెలు వేసుకున్న పేదలకు పట్టాలు ఇవ్వాలి

సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు

వరంగల్ జూన్ 16 సుదీక్ష న్యూస్ : వరంగల్ లక్ష్మీపురం భూపోరాట కేంద్రంలో మంగళవారం సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కళ్లపల్లి శ్రీనివాసరావుతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా సిపిఐ సాంబమూర్తి అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ పేదలందరికీ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఇస్తామని, ప్రభుత్వ భూములలో గుడిసెలు వేసుకుని నివసిస్తున్న పేదలకు జీవో 58 ప్రకారం పట్టాలు ఇస్తామని చెప్పి నేడు అమలు చేయడం లేదన్నారు. రాష్ట్రంలో లక్షలాది మంది ఇండ్లు లేని నిరుపేదలు ఉన్నారని అన్నారు. స్వాతంత్ర్యం వచ్చి 75 ఏండ్లు గడిచినా పేదవాడి జీవితం మార లేదని అన్నారు. పేదలు సిపిఐ ఆధ్వర్యంలో అనేక చోట్ల భూపోరాటాలు నిర్వహించి గుడిసెలు వేసుకుని నివసిస్తున్నారని, వారందరికీ పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ప్రజాసమస్యలపై నిత్యం పోరాడేది కమ్యూనిస్టులేనని అన్నారు. పాలకులు పేదల అనుకూల విధానాలను అవలంబించడం లేదని, ప్రధాని నరేంద్ర మోదీ బంగారం కొన వద్దంటూ పేదలకు నీతులు చెబుతూ పెద్దలకు అనుకూలంగా మెదులుతున్నారని విమర్శించారు. కమ్యూనిస్టుల మద్దతు ఉంటేనే ప్రభుత్వాలు మనగలుగుతాయని అన్నారు. కమ్యూనిస్టులు లేకుంటే తెలంగాణాకే విముక్తి జరిగేది కాదని అన్నారు.
ఈ కార్యక్రమంలో వరంగల్ జిల్లా కార్యదర్శి షేక్ బాష్ మియా హన్మకొండ జిల్లా కార్యదర్శి కర్రె బిక్షపతి రాష్ట్ర సమితి సభ్యులు పంజాల రమేష్ తోట బిక్షపతి వల్లి ఉల్లాఖాధ్రి వరంగల్ జిల్లా సహాయ కార్యదర్శి దండు లక్ష్మణ్ జిల్లా కార్యవర్గ సభ్యులు గుండె బద్రి గన్నారపు రమేష్ బుస్స రవీందర్ శంకరయ్య జిల్లా సమితి సభ్యులు ఓర్సు రాజు జాన్ పాల్ యండి అక్బర్ పాషా ల్యాదల్ల శరత్ దిడ్డి పార్థసారథి సుంకరి భవాని దుమాల పద్మ ఈసంపల్లి మంజుల తాత స్వాతి లక్క రమేష్ తాటిపాముల ఉదయశ్రీ తోట మల్లయ్య తోట రాజు బందెల కృష్ణ సింగారపు ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు
🏠 Home