🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 17 Jun, 2026 | Page: 1

చ‌రిత్ర సృష్టించిన అర్జెంటీనా స్టార్‌..

అర్జెంటీనా ఫేమ‌స్ ఫుట్‌బాల్ ప్లేయ‌ర్ లియోన‌ల్ మెస్సీచ‌రిత్ర సృష్టించాడు. ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో భాగంగా అల్జీరియాతో జ‌రిగిన మ్యాచ్‌లో హ్యాట్రిక్ గోల్స్ చేశాడు. దీంతో ఆ మ్యాచ్‌లో 3-0 గోల్స్ తేడాతో అర్జెంటీనా విజ‌యం సాధించింది. ఇక మెస్సీ ఖాతాలో మ‌రో రికార్డు ప‌డింది. వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక సంఖ్య‌లో గోల్స్ చేసిన జ‌ర్మ‌నీ ప్లేయ‌ర్ మిరోస్లేవ్ క్లోస్‌తో స‌మానంగా నిలిచాడు. జ‌ర్మ‌నీ ఫుట్‌బాల‌ర్ క్లోస్ వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధికంగా 16 గోల్స్ చేసి లీడింగ్ స్కోర‌ర్‌గా నిలిచాడు. అయితే ఇప్పుడు అత‌ని రికార్డును మెస్సీ స‌మం చేశాడు.ఆరో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడుతున్న మెస్సీ.. 200వ అంత‌ర్జాతీయ ఫుట్‌బాల్ మ్యాచ్ ఆడాడు. 8 సార్లు బాల‌న్ డీఓర్ అవార్డు గెలుచుకున్న మెస్సీ.. అల్జీరియాతో మ్యాచ్‌లో చెల‌రేగిపోయాడు. కాన్సాస్ సిటీ స్టేడియంలో జ‌రిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా గ‌ట్టిగా పోరాడాల్సివ చ్చింది. డిఫెండింగ్ చాంపియ‌న్ రూపంలో బ‌రిలోకి దిగిన అర్జెంటీనా ఈసారి త‌న తొలి మ్యాచ్‌లో విజ‌యాన్ని న‌మోదు చేసింది.
మెస్సీ త‌న డ్రిబ్లింగ్ మ్యాజిక్‌తో మ‌ళ్లీ ఆక‌ట్టుకున్నాడు. తొలుత 17వ నిమిషంలో గోల్ కొట్టాడు. మియామీ టీమ్‌మేట్ రోడ్రిగో డీ పౌల్ ఇచ్చిన పాస్‌ను మెస్సీ గోల్‌గా మ‌లిచాడు. ఇక జిదానే చేసిన పొర‌పాటును మెస్సీ స‌ద్వినియోగం చేసుకుని రెండో గోల్ కొట్టాడు
🏠 Home