🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 17 Jun, 2026 | Page: 1

దూసుకొస్తున్న ఫ్రాన్స్ స్ట్ర‌యిక‌ర్..

ఫిఫా వ‌రల్డ్‌క‌ప్‌లో ఫ్రాన్స్ స్ట్ర‌యిక‌ర్ కైలియ‌న్ ఎంబాప్పే త‌న ట్యాటెంట్ ప్ర‌ద‌ర్శించాడు. సెనిగ‌ల్‌తో జ‌రిగిన తొలి మ్యాచ్‌లోనే రెండు గోల్స్ చేసి జ‌ట్టు విజ‌యంలో కీల‌క పాత్ర పోషించాడు. ఇక ఫుట్‌బాల్ వ‌ర‌ల్డ్‌క‌ప్ చ‌రిత్ర‌లో అత్య‌ధిక గోల్స్ సాధించిన ఫ్రాన్స్ ప్లేయర్‌గా అత‌ను రికార్డు సృష్టించాడు. సెనిగ‌ల్‌తో మ్యాచ్‌లో 3-1 గోల్స్ తేడాతో ఫ్రాన్స్ విజ‌యం సాధించింది. అయితే ఇప్ప‌టి వ‌ర‌కు వ‌ర‌ల్డ్‌క‌ప్‌ల్లో ఎంబాప్పే త‌న ఖాతాలో 14 గోల్స్ వేసుకున్నాడు. కేవ‌లం మూడో వ‌ర‌ల్డ్‌క‌ప్ ఆడుతున్న ఎంబాప్పే త‌న గోల్స్ స్కోరింగ్‌లో దూసుకొస్తున్నాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచ క‌ప్ పోటీల్లో అత్య‌ధిక సంఖ్య‌లో గోల్స్ చేసిన ప్లేయ‌ర్ల‌లో క్లోస్‌, మెస్సీ ఉన్నారు. ఆ ఇద్ద‌రు ప్లేయ‌ర్లు వ్య‌క్తిగ‌తంగా వ‌ర‌ల్డ్‌క‌ప్ టోర్నీల్లో 16 గోల్స్ చేశారు. దేశం కోసం చ‌రిత్ర సృష్టిస్తాన‌ని, త‌మ జ‌ట్టు వ‌ర‌ల్డ్‌క‌ప్ గెలిచేందుకు ఆడుతాన‌ని ఎంబాప్పే అన్నాడుసెనిగ‌ల్‌తో మ్యాచ్‌లో ఎంబాప్పే 66వ నిమిషంలో తొలి గోల్ చేశాడు. అయితే సెనిగ‌ల్ గోల్‌కీప‌ర్ మెండీ ఆరంభంలో ధీటుగా ఫ్రాన్స్ స్ట్ర‌యిక‌ర్ల‌ను అడ్డుకున్నాడు. తొలి గోల్ చేసిన త‌ర్వాత కెప్టెన్ ఎంబాప్పే అరుదైన రీతిలో దాన్ని సెల‌బ్రేట్ చేసుకున్నాడు. గోల్ కొట్టిన త‌ర్వాత ఫ్లూట్ ఊదాడు. ఇటీవ‌ల ఓ ఇంట‌ర్వ్యూలో ఎంబాప్పే ఫ్లూట్ వాయించాడు. ఆ స‌మ‌యంలో మాట్లాడుతూ ఒక‌వేళ ఆఫ్రికాపై గోల్ కొడితే, అప్పుడు పిల్ల‌నిగ్రోవిని వాయిస్తాన‌ని చెప్పాడు. దాని ప్ర‌కార‌మే గోల్ కొట్టిన త‌ర్వాత ఎంబాప్పే వేణువును ఊదుతున్న‌ట్లుగా సంకేతం ఇచ్చాడు. ఇక మ‌ళ్లీ 96వ నిమిషంలో రెండో గోల్ చేశాడు. ఇప్ప‌టి వ‌ర‌కు ఎంబాప్పే వ‌ర‌ల్డ్‌క‌ప్ గోల్స్ సంఖ్య 14కు చేరుకున్న‌ది.
🏠 Home