అరుదైన వ్యాధితో బాధపడుతున్న అభిమాని నిరంజన్‌ను పరామర్శించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్
హనుమకొండ, జూన్ 17 (సుదీక్ష న్యూస్):
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ మానవత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలిచారు. అరుదైన జన్యుపరమైన డి.ఎన్.డి వ్యాధితో బాధపడుతూ మంచానికే పరిమితమైన హనుమకొండకు చెందిన 17 ఏళ్ల అభిమాని నిరంజన్‌ను ఆయన స్వయంగా ఇంటికి వెళ్లి పరామర్శించారు.
హనుమాన్‌నగర్‌లోని నిరంజన్ నివాసానికి చేరుకున్న పవన్ కళ్యాణ్, అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుని కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిరంజన్ తల్లిదండ్రులు పొనుగోటి రాంగోపాల్, మానసలను పరామర్శించి ధైర్యం చెప్పారు. వైద్య ఖర్చుల కోసం రూ.1 లక్షల ఆర్థిక సహాయం అందజేయడంతో పాటు తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి తీర్థప్రసాదాలు, వస్త్రాలను అందించి ఆశీర్వదించారు.
చిన్ననాటి నుంచి పవన్ కళ్యాణ్‌కు వీరాభిమాని అయిన నిరంజన్ తన చివరి కోరికగా ఆయనను కలవాలని కోరుకోవడంతో, ఆ విషయాన్ని తెలుసుకున్న పవన్ కళ్యాణ్ స్వయంగా ఇంటికి వెళ్లడం కుటుంబ సభ్యులను భావోద్వేగానికి గురిచేసింది. నిరంజన్‌తో కొంతసేపు ఆప్యాయంగా మాట్లాడి, నుదిటిపై ముద్దు పెట్టి ధైర్యం చెప్పారు.
నిరంజన్ ఆరోగ్యం కోసం వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. అలాగే కుటుంబ జీవనోపాధి మెరుగుపడేందుకు క్యాంటీన్ ఏర్పాటు చేయాలని జనసేన తెలంగాణ నాయకులకు సూచనలు చేశారు.
ఈ సందర్భంగా నిరంజన్ ఆరోగ్యంగా ఉన్న సమయంలో పవన్ కళ్యాణ్‌ను అనుకరిస్తూ చేసిన వీడియోలు, ఫొటోలను పరిశీలించిన ఆయన, బాలుడి అభిమానం చూసి భావోద్వేగానికి లోనయ్యారు. అనంతరం పవన్ కళ్యాణ్ నేరుగా వరంగల్ భద్రకాళి అమ్మవారి ఆలయానికి వెళ్లి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో జనసేన తెలంగాణ ఇన్‌చార్జ్ శంకర్ గౌడ్, ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి, నాయకులు రాధారం రాజలింగం, ఆర్.కే.సాగర్ తదితరులు పాల్గొన్నారు.
ఫోటో క్యాప్షన్:
అరుదైన వ్యాధితో బాధపడుతున్న హనుమకొండకు చెందిన అభిమాని నిరంజన్‌ను పరామర్శించి ఆర్థిక సహాయం అందజేస్తున్న ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్.