🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 18 Jun, 2026 | Page: 1

ఉచిత కంటి వైద్య శిబిరానికి ఏర్పాట్లు పూర్తి

వరంగల్, జూన్ 18 (సుదీక్ష న్యూస్):
ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదినాన్ని పురస్కరించుకుని ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జూన్ 19న నిర్వహించనున్న ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాట్లను ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు తిలక్ రోడ్‌లోని కేవీఎస్ ఫంక్షన్ హాల్‌లో పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సేవా కార్యక్రమాల ద్వారా జన్మదిన వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు. శిబిరంలో నిపుణులైన వైద్యులు కంటి పరీక్షలు నిర్వహించనున్నారని, అవసరమైన వారికి ఉచితంగా ఆపరేషన్లు, కళ్లద్దాలు అందజేయనున్నట్లు తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కందిమల్ల మహేష్, కోమాకుల నాగరాజు, మూసిపెట్ల నవీన్ గౌడ్, కోటా సతీష్, మామిడాల సురేష్, గడ్డం మహేష్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు.
🏠 Home