🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 18 Jun, 2026 | Page: 1

తెలంగాణ ఉద్యమ కేసు విచారణకు హాజరైన ఉద్యమ నాయకులు

హనుమకొండ, జూన్ 18 (సుదీక్ష న్యూస్):
తెలంగాణ ఉద్యమ సమయంలో నమోదైన కేసు విచారణలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర నేత, మాజీ కార్పొరేటర్ జోరిక రమేష్, బోడ డిన్న, చాగంటి రమేష్‌లు గురువారం హనుమకొండలోని 3వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో హాజరయ్యారు.

2014 జూన్ 1న హనుమకొండలోని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహ ధ్వంసం ఘటనకు సంబంధించి సుబేదారి పోలీస్ స్టేషన్‌లో నమోదైన సీసీ నంబర్ 3814/2022 కేసు విచారణ సందర్భంగా నిందితులు కోర్టు ముందు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణను కోర్టు జూలై 15, 2026కు వాయిదా వేసింది.

ఉద్యమకారుల తరఫున న్యాయవాదులు తాళ్లపల్లి జనార్దన్ గౌడ్, గుర్రాల వినోద్, చందు తదితరులు వకాల్తా పుచ్చుకున్నారు.

ఈ సందర్భంగా జోరిక రమేష్ మాట్లాడుతూ, గత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఉద్యమకారులపై నమోదైన 99 శాతం కేసులను ఎత్తివేశారని, కొన్ని కేసులు మాత్రమే సాంకేతిక కారణాలతో పెండింగ్‌లో ఉన్నాయని అన్నారు. ప్రస్తుత ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను అమలు చేసి, పెండింగ్‌లో ఉన్న ఉద్యమ కేసులను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు.
🏠 Home