🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

కృష్ణా జిల్లాలో విషాదం..

కృష్ణా జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. బిర్యాని కోసం వెళ్లిన ఓ వ్యక్తి రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే.. ఉయ్యూరు మండలం తోమతోటి గ్రామానికి చెందిన అర్జునరావు(30) ప్రొక్లెన్‌ డ్రైవర్‌గా జీవనం కొనసాగిస్తున్నాడు. బిర్యాని తీసుకొస్తానని ఇంట్లో చెప్పి అర్జునరావు బైక్‌పై ఉయ్యూరు వెళ్లారు.తిరిగి వస్తుండగా ఉయ్యూరు-తేలప్రోలు రహదారిలో కాటూరు వద్దకు రాగానే కారు, బైక్‌ ఢీకొన్నాయి.ఈ ప్రమాదంలో అర్జునరావు అక్కడికక్కడే మృతి చెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘన స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు.
🏠 Home