🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

అతడు మరో నాలుగేండ్లు ఆడుతాడు..

ఐపీఎల్ చరిత్రలో విరాట్ కోహ్లీరాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుది(RCB) విడదీయరాని బంధం. 2008 లీగ్ ప్రారంభమైనప్పటి నుంచి నేటి వరకు ఒకే ఫ్రాంచైజీ తరఫున 19 సీజన్లలో ఆడిన ఏకైక ఆటగాడిగా ఈ బ్యాటింగ్ దిగ్గజం నిలిచాడు. తాను జట్లు మారే ప్రణాళికలు లేవని, తన ఐపీఎల్ కెరీర్‌ను ఆర్‌సీబీతోనే ముగించాలనుకుంటున్నానని కోహ్లీ పలు సందర్భాల్లో స్పష్టం చేశాడు. ఆర్సీబీ అభిమానులు ఏళ్లుగా ఎదురుచూస్తున్న కలను నిజం చేస్తూ వరుసగా గత రెండు సీజన్‌లో ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకోవడం ద్వారా ఆర్‌సీబీ తమ టైటిల్ కరువును తీర్చుకుంది.

ఈ క్రమంలో స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఐపీఎల్(IPL) భవిష్యత్తుపై రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సీఈఓ రాజేశ్ మీనన్ కీలక వ్యాఖ్యలు చేశారు. కోహ్లీ మరో 3 నుంచి 4 ఏళ్ల పాటు ఐపీఎల్‌లో ఆర్‌సీబీ తరఫునే ఆడతారని ఆయన స్పష్టం చేశారు. రిటైర్మెంట్ తర్వాత కూడా కోహ్లీ ఫ్రాంచైజీతో కొనసాగుతారని పేర్కొన్నారు. అతను పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. ఆట పట్ల అతనికి ఉండే తపన ఏమాత్రం తగ్గలేదు. ఈ ఐపీఎల్ సీజన్‌లో అతనిలో కనిపించిన ఉత్సాహం చూస్తుంటే మరికొంత కాలం ఆడేందుకు ఎలాంటి సమస్యా ఉండదని ఆయన స్పష్టం చేశారు. అనుభవజ్ఞుడైన విరాట్‌ లాంటి బ్యాటర్‌ జట్టుకు ఎంతో ఉపయోగకరమన్నారు.

🏠 Home