ఎర్రబెల్లి ప్రదీప్ రావు జన్మదినం సందర్భంగా మహా ఉచిత కంటి వైద్య శిబిరం
వరంగల్, జూన్ 19 (సుదీక్ష న్యూస్): ఎర్రబెల్లి ప్రదీప్ రావు గారి జన్మదినాన్ని పురస్కరించుకుని వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని కాశీబుగ్గ KVS ప్రాంతంలో శంకర్ కంటి హాస్పిటల్ సహకారంతో ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహా ఉచిత కంటి వైద్య శిబిరం ఘనంగా నిర్వహించారు.
ఈ శిబిరానికి స్థానిక ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. సుమారు 2,000 మంది పేద, మధ్యతరగతి ప్రజలు పాల్గొని కంటి పరీక్షలు చేయించుకున్నారు. నిపుణులైన వైద్యుల బృందం రోగులను పరీక్షించి, అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలు అందించడంతో పాటు తదుపరి చికిత్సపై సూచనలు చేశారు.
ఈ సందర్భంగా ఎర్రబెల్లి వినీత్ రావు మాట్లాడుతూ, ప్రజలకు ఉపయోగపడే సేవా కార్యక్రమాలను నిర్వహించడం ట్రస్ట్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఆరోగ్యం ప్రతి ఒక్కరి హక్కు అని, ముఖ్యంగా పేద ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను నిర్వహిస్తున్నామని చెప్పారు. భారీ సంఖ్యలో ప్రజలు పాల్గొనడం సంతోషకరమని, భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు చేపడతామని పేర్కొన్నారు.
కార్యక్రమంలో మాజీ మేయర్ తక్కెళ్ళపల్లి రాజేశ్వరరావు, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంటా రవికుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ వన్నాల వెంకటరమణ, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సిద్ధం నరేష్, సీనియర్ నాయకులు సముద్రాల పరమేశ్వర్, రత్నం సతీష్ షా, మల్లాడి తిరుపతిరెడ్డి, రాణా ప్రతాపరెడ్డి, త్రిలోక్ తదితరులు పాల్గొన్నారు. స్థానిక నాయకులు, వైద్యులు, వాలంటీర్లు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సేవా కార్యక్రమాన్ని స్థానిక ప్రజలు అభినందిస్తూ ట్రస్ట్‌కు కృతజ్ఞతలు తెలిపారు.