🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 19 Jun, 2026 | Page: 1

రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహణ – 2 వేల మందికి మహా అన్నదానం

వరంగల్, జూన్ 19 (సుదీక్ష న్యూస్): కొండా దంపతుల ఆదేశానుసారం, వారి నాయకత్వంలో ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు, పార్లమెంట్ సభ్యుడు శ్రీ రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను వరంగల్ చౌరస్తాలో ఘనంగా నిర్వహించారు. రాష్ట్ర కాంగ్రెస్ నాయకుడు గోపాల నవీన్ రాజ్ ఆధ్వర్యంలో భారీ కేక్ కట్ చేసి సుమారు 2 వేల మందికి మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన గోపాల నవీన్ రాజ్ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ గాంధీ కుటుంబం దేశం కోసం ఎన్నో త్యాగాలు చేసిన కుటుంబమని కొనియాడారు. శ్రీ రాహుల్ గాంధీ భవిష్యత్తులో భారత ప్రధానమంత్రి కావాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు.

వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కొండా దంపతుల నాయకత్వంలో రంగశాయిపేట నుంచి పోచమ్మ మైదాన్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టిన విషయాన్ని గుర్తు చేశారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో హరిజన, గిరిజన, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం గాంధీ కుటుంబం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో టీపీసీసీ కార్యదర్శి మీసాల ప్రకాష్, కొత్తపెళ్లి శ్రీనివాస్, కాంగ్రెస్ నాయకులు మబ్బు ప్రవీణ్, కురిమిళ్ల సంపత్, క్యాతం రవీందర్, మాజీ కార్పొరేటర్లు కత్తెరశాల వేణుగోపాల్, జారతి రమేష్, సోమిశెట్టి ప్రవీణ్ కుమార్, బసవరాజ్ కుమార్, సురేష్ జోషి, ముష్కమల్ల అరుణ, సుధాకర్, గుండు చందన, పూర్ణచందర్, బైరబోయిన ఉమా దామోదర్ యాదవ్, పల్లం పద్మారవి, వాస్కుల బాబు, భోగి సువర్ణ, సురేష్, పోశాల పద్మ, కెడల పద్మ, కావేటి కవిత, బత్తిని వసుంధర, నాగపురి కల్పన, చింతాకుల అనిల్, కూరగాయల మార్కెట్ వర్తక సంఘం అధ్యక్షుడు జారతి శ్రీనివాస్, భద్రకాళి ట్రస్ట్ బోర్డు డైరెక్టర్లు జారతి వెంకటేశ్వర్లు, తొగరు క్రాంతి తదితరులు పాల్గొన్నారు.

అలాగే కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, కొండా దంపతుల అభిమానులు పెద్ద ఎత్తున హాజరై రాహుల్ గాంధీ జన్మదిన వేడుకలను విజయవంతం చేశారు.
🏠 Home