రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో ఏవీవీ విద్యార్థులకు నోటు పుస్తకాల పంపిణీ
వరంగల్, జూన్ 19 (సుదీక్ష న్యూస్): స్థానిక ఏవీవీ ఉన్నత పాఠశాలలో రోటరీ క్లబ్ వరంగల్ ఆధ్వర్యంలో రూ.25 వేల విలువైన నోటు పుస్తకాలను విద్యార్థులకు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా 300 మంది విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలు అందజేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ భుజేందర్ రెడ్డి మాట్లాడుతూ, గత నాలుగు సంవత్సరాలుగా రోటరీ క్లబ్ వరంగల్ పేద విద్యార్థులకు నిలయమైన ఏవీవీ విద్యాసంస్థకు తమ వంతు సహకారాన్ని అందిస్తోందని తెలిపారు. ఈ ఏడాది 300 మంది విద్యార్థులకు నోటు పుస్తకాలు అందించడం ద్వారా వారి విద్యాభ్యాసానికి తోడ్పాటు అందిస్తున్నారని పేర్కొన్నారు.
రోటరీ క్లబ్ వరంగల్ అధ్యక్షుడు కొండూరు శివప్రసాద్ మాట్లాడుతూ, తాను ఏవీవీ పూర్వ విద్యార్థినని, ఈ పవిత్ర విద్యా సంస్థలో చదువుకుంటున్న విద్యార్థులు ఉన్నత స్థాయికి చేరుకుని సమాజంలో గుర్తింపు పొందాలని ఆకాంక్షించారు.
ఉన్నత పాఠశాల కోఆర్డినేటర్ టి. వాసుదేవులు మాట్లాడుతూ, ఈ విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యార్థులు పదో తరగతిలో 100 శాతం ఉత్తీర్ణత సాధించారని, ముగ్గురు విద్యార్థులు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్‌కు అర్హత సాధించారని తెలిపారు. అలాగే 550కి పైగా మార్కులు సాధించిన విద్యార్థులు జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సన్మానం పొందారని చెప్పారు.
రోటరీ క్లబ్ ట్రస్ట్ అధ్యక్షుడు బబ్బుల వెంకటేశ్వర్లు మాట్లాడుతూ, భవిష్యత్తులో ముగ్గురు విద్యార్థులకు సైకిళ్లు అందించడంతో పాటు విద్యార్థుల విద్యాభ్యాసానికి మరింత సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో మామిడాల సుధాకర్, కొమురవెల్లి రవీందర్, ఎల్లంకి రాజయ్య తదితరులు పాల్గొని విద్యార్థులను ఆశీర్వదించారు. అనంతరం విద్యార్థులకు నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పాఠశాల అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.