మాదక ద్రవ్యాల రవాణాకు సరికొత్త 'స్మార్ట్ డ్రగ్' దందా - 'ఈగల్' నివేదికలో నమ్మలేని నిజాలు
టెక్నాలజీ ప్రపంచాన్ని మార్చేస్తే, అదే టెక్నాలజీని వాడుకుంటూ మత్తు వ్యాపారులు వేస్తున్న మైండ్ బ్లోయింగ్ ఎత్తుగడలు చూసి అటు ఇంటెలిజెన్స్ వర్గాలు, ఇటు పోలీసులు సైతం ఆశ్చర్యపోతున్నారు. పేరు, అడ్రస్‌కు పొంతన ఉండదు. కేవలం మీ చేతిలో ఉన్న మొబైల్‌లో ఒకే ఒక్క క్లిక్‌తో ఆర్డర్ ఇస్తే చాలు మత్తు పదార్థాలు నేరుగా మీ ఇంటి తలుపు తడుతున్నాయి. ఏకంగా మనం రోజువారీ వాడే క్యాబ్, డెలివరీ అగ్రిగేటర్ సర్వీసులను వాడుకుంటూ సాగుతున్న ఈ సరికొత్త 'స్మార్ట్ డ్రగ్' దందా ఏంటి? ఈ స్మార్ట్ డ్రగ్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ఆ అంతర్జాతీయ కింగ్‌పిన్స్ ఎవరు? ఈగల్ అధికారులు నివేదికలో బయటపెట్టిన ఆ నమ్మలేని నిజాలు ఏంటనేది ఈ కథనం ద్వారా తెలుసుకుందాం.
డార్క్‌వెబ్ వేదికగా ఈ దందా : మాదకద్రవ్యాల రవాణా కోసం విక్రేతలు సరికొత్త ఎత్తులు వేస్తున్నారు. పాత పద్ధతులకు స్వస్తి చెప్పి, టెక్నాలజీని ఆయుధంగా చేసుకుంటున్నారు. క్రయవిక్రేతల పేర్లు బయటపడకుండా ఉండేందుకు డార్క్‌వెబ్ వేదికగా ఈ దందా నడిపిస్తున్నారు. కొనుగోలుదారులు డార్క్ వెబ్‌లో తప్పుడు పేరు, తప్పుడు చిరునామా ఇస్తూ కేవలం ఫోన్ నంబర్ మాత్రం అసలైంది ఇస్తున్నారు. పార్సిల్ బుక్ అవ్వగానే వచ్చే బుకింగ్ నంబర్ ఆధారంగా అది ఎక్కడికి వచ్చిందో ట్రాక్ చేస్తూ కస్టమర్లే నేరుగా కొరియర్ కార్యాలయానికి వెళ్లి సరుకును గుట్టుచప్పుడు కాకుండా తెచ్చుకుంటున్నారు.
ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయం : హైదరాబాద్‌లో గంజాయి చాక్లెట్లను ఏకంగా ఈ-కామర్స్ వెబ్‌సైట్ల ద్వారా విక్రయిస్తుండటం కలకలం రేపుతోంది. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకుంటే చాలు హోమ్ డెలివరీ సర్వీస్‌లాగా ఇంటికే సరఫరా చేస్తున్నారు. నెదర్లాండ్స్, బెల్జియం, ఫ్రాన్స్ వంటి దేశాల నుంచి అంతర్జాతీయ కొరియర్ సంస్థల ద్వారా ఈ మత్తు పదార్థాలు నగరానికి వస్తున్నట్లు ఈగల్ అధికారులు గుర్తించారు.