స్కూలు నిండినది : ఆ సర్కారు బడుల్లో 'హౌస్‌ఫుల్' బోర్డులు
మా పాఠశాలలో ప్రవేశాలు పూర్తయ్యాయి. ఇంకా వెయిటింగ్లో వందల మంది పిల్లలున్నారు. ఎవరైనా పిల్లలు మానేస్తే చూద్దాం.' సాధారణంగా ఇలాంటి సంభాషణను కార్పొరేట్ స్కూల్స్‌లో చూస్తుంటాం. కానీ కొన్ని ప్రభుత్వ బడులు చాలా డిమాండ్‌ను ఎదుర్కొంటున్నారు. తమ పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులు వరుస కడుతుండటంతో అందరికీ సమాధానం చెప్పలేక పలు విద్యాసంస్థలు గేట్లకు 'హౌస్‌ఫుల్ బోర్డులు' పెడుతున్నాయి. కార్పొరేట్ స్థాయి వసతులు, అధునాతనమైన ల్యాబ్‌లు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులతో ఉన్న ఆదర్శ పాఠశాలలపై ఈటీవీ భారత్ ప్రత్యేక కథనం.
బాలికలకు బస్సు, హాస్టల్ సౌకర్యం : వనపర్తిలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో గత ఏడాది మొత్తం 905 మంది విద్యార్థులు చదువుకున్నారు. కానీ ప్రస్తుత సంవత్సరం ప్రవేశాల సంఖ్య వెయ్యి దాటింది. ఇందులోని పదవ తరగతిలో మొత్తం ఆరు సెక్షన్లు (ఆంగ్ల మాధ్యమం - 4, తెలుగు - 2) ఏర్పాటయ్యాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చి చదువుకునే విద్యార్థుల కోసం హాస్టల్స్ అందుబాటులో ఉన్నాయి. స్కూల్ నుంచి అక్కడికి వెళ్లడానికి బస్సు సౌకర్యం ఉంది. బడిలో డిజిటల్ బోధనా కొనసాగుతోంది. బాలికలకు హస్తకళలు, కరాటే, యోగా, చిత్రలేఖనం, కూచిపూడి నృత్యం వంటివి నేర్పిస్తున్నారు.