నెల్లూరు జిల్లా లో మరో కిలాడి లేడీ బత్తల రజిత@రమ్య బోగాతం బట్టబయలు
👉 లేడీ డాన్ స్వగ్రామం నెల్లూరు జిల్లా కలువాయి మండలం చవటపల్లి గ్రామం
👉 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల్లోనూ రజిత బాధితులు
👉 ఉద్యోగాలు పేరిట అనేకమంది వద్ద కోట్ల రూపాయలు లూటీ
👉 ఎట్టకేలకు అరెస్ట్ చేసిన సైదాపురం పోలీసులు
👉 గత కొన్ని సంవత్సరాలుగా మాయమాటలతో నిరుద్యోగులను మోసం చేస్తున్న రజిత
👉 రజిత మోసం లో తండ్రి వెంకటేశ్వర్లు,ప్రియుడు చందు,మరో పోలీసు అధికారి ప్రమేయం ఉన్నట్టు బాధితులు ఆరోపణలు
👉 SBI లో ఉద్యోగం పేరిట కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన వద్ద 52,64,023 రూపాయలు తీసుకుని మోసం చేసిన కేసులో అరెస్టైన రజిత
👉 అరెస్ట్ లు సరే రికవరీ ఉంటుందా,బాధితులకు న్యాయం జరుగుతుందా చూడాలి
👉 లేడీ డాన్ లకు నిలయంగా నెల్లూరు జిల్లా..రాష్ట్రం లో సంచలనం రేపిన లేడీ డాన్ నిడిగుంట అరుణ,గూడూరు టిడ్కో గృహాల్లో హత్య కేసులో అరెస్ట్ అయిన కోట మండలం కు చెందిన మహిళ,హౌసింగ్ బోర్డులో వామపక్ష నాయకుడు పెంచలయ్య హత్య కేసులో ప్రధాన నిందితుల్లో ఒకరైన గంజాయి డాన్ ఒకరు, ఇప్పుడు ఉద్యోగాల పేరిట కోట్లు కొల్లగొట్టిన రజిత వీరంతా పోలీసులు అరెస్ట్ తో బయటపడ్డ లేడీ డాన్ లు..ఇంకా ఎంత మంది తెరచాటున ఉన్నారో
రాపూరు CI శ్రీనివాసరావు తెలిపిన వివరాల మేరకు....
నెల్లూరు జిల్లా సైదాపురం మండలం పోలీసు స్టేషన్ లో రాపూరు CI మీడియా సమావేశం నిర్వహించారు, ఈ సందర్భంగా ఉద్యోగుల పేట మోసం చేస్తున్న రజిత అనే యువతిని అరెస్టు చేసినట్టు సీఐ తెలిపారు... పూర్తి వివరాలు చూసుకుంటే నెల్లూరు జిల్లా సైదాపురం మండలం కలిచేడు గ్రామానికి చెందిన పూజారి చందన అనే మహిళ కలువాయి మండలం చవటపాలెం గ్రామానికి చెందిన రజిత@రమ్య అని మహిళ తనకు స్టేట్ బ్యాంకులో ఉన్నత స్థాయి అధికారులతో పరిచయాలు ఉన్నాయని వారి ద్వారా SBI లో జనరల్ మేనేజర్ ఉద్యోగం ఇప్పిస్తానని పోలీసు వెరిఫికేషన్,ID కార్డు,అపాయింట్మెంట్ లెటర్ లు ఇప్పిస్తానని విడతల వారీగా 52 లక్షల రూపాయలు నగదు తీసుకొని SBI నకిలీ అపాయింట్మెంట్ లెటర్, ఐడి కార్డు, ఈ మెయిల్స్,నకిలీ ధ్రువపత్రాలు ఇచ్చి మోసం చేసిందని అది గ్రహించి
డబ్బులు అడిగితే సమాధానం చెప్పకుండా,తిరిగి బెదిరిస్తూ ఉండడంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు సైదాపురం పోలీస్ స్టేషన్ లో రజితపై ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకున్న సైదాపురం పోలీసులు విచారణ చేసి రజిత డబ్బులు తీసుకున్నది వాస్తవమని తేలడం తో రజిత@రమ్య ను అరెస్ట్ చేశామని ఈ మోసం వ్యవహారం లో ఇతరుల ప్రమేయం పై కూడా దర్యాప్తు చేస్తున్నామని CI తెలిపారు శ్రీనివాసరావు తెలిపారు, ఇదే సమయంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని ఎవరు చెప్పినా నమ్మవద్దని అలా ఎవరైనా చెప్తే 112,1930 నంబర్లకు ఫోన్ చేసి పోలీసులకు సమాచారం ఇవ్వాలని CI తెలిపారు...
లేడీ డాన్ రజిత@రమ్య..మోసాలకు కేరాఫ్...
ఈ లేడీ డాన్ రజత బాధితులు రెండు రాష్ట్రాల్లోనూ ఉన్నట్లు తెలుస్తుంది, రజిత మోసాల్లో ప్రధానంగా ఈమె ప్రియుడు చందు అనే వ్యక్తి పూర్తిగా సహకరించినట్టు, రజిత కుటుంబ సభ్యుల పాత్ర కూడా ఉన్నట్టు తెలుస్తుంది.. గత మూడు సంవత్సరాలుగా పదుల సంఖ్యలో బాధితులు అనేక పోలీస్ స్టేషన్లో రజితపై ఫిర్యాదులు చేసినప్పటికీ లేడీ డాన్ కు ఓ పోలీసు అధికారి సహకారం వల్ల బాధితులపైనే కొందరు పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేసే వారిని మీరు ఎలా మోసపోతారు అంటూ ఎదురు ప్రశ్నించే వాళ్ళని, కడుపుతో ఉన్న మహిళలు పసిబిడ్డలను ఎత్తుకుని గతంలో నెల్లూరు,కడప జిల్లా ల్లో ఎస్పీ కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయిందని ఎట్టకేలకు లేడీ డాన్ రజిత అరెస్టుతో కొంత ఊరట చెందినప్పటికీ రజితకు ఇచ్చిన డబ్బులు తిరిగి ఎలా రికవరీ చేసుకోవాలి అనేది బాధితులకు పెద్ద ప్రశ్నక మిగిలిపోయింది, పోలీసులు పెద్ద మనసు చేసుకొని లోతుగా దర్యాప్తు చేసి రెవెన్యూ రికవరీ యాక్ట్ కింద బాధితులకు న్యాయం చేయాలని కోరుతున్నారు...