🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

ఇజ్రాయెల్‌, హిజ్‌బుల్లా సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించాయి

ఇజ్రాయెల్‌, హిజ్‌బుల్లా సీజ్‌ఫైర్‌కు అంగీక‌రించాయని అమెరికా అధికారి ఒక‌రు తెలిపారు. శుక్రవారం ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ జ‌రిపిన వైమానిక దాడిలో 47 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. ఇక హిజ్‌బుల్లా దాడిలో న‌లుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతిచెందారు. ఇజ్రాయెల్‌, హిజ్‌బుల్లా మ‌ధ్య కాల్పుల విర‌మ‌ణ అగ్రిమెంట్ కుదిరిన‌ట్లు అమెరికా అధికారులు తెలిపారు. శుక్రవారం ద‌క్షిణ లెబ‌నాన్‌పై ఇజ్రాయిల్ జ‌రిపిన వైమానిక దాడిలో 47 మంది మృతిచెందిన విష‌యం తెలిసిందే. లెబ‌నాన్‌లో హిజ్‌బుల్లా జ‌రిపిన దాడిలో న‌లుగురు ఇజ్రాయెల్ సైనికులు కూడా మృతిచెందారు. ప్ర‌స్తుతం సీజ్‌ఫైర్ అమ‌లులో ఉన్న‌ట్లు ఇజ్రాయిలీ సైన్యం క‌న్ఫ‌ర్మ్ చేసింది. కానీ ఎటువంటి స‌మ‌స్య‌లు ఉన్నా.. ఎదుర్కొంటామ‌ని ఐడీఎఫ్ చెప్పింది. అయితే సీజ్‌ఫైర్ గురించి ఇంకా హిజ్‌బుల్లా క‌న్ఫ‌ర్మ్ చేయ‌లేదు. హిజ్‌బుల్లాను అంతం చేయాల‌ని ఇజ్రాయెల్ సంక‌ల్పించింద‌ని, కానీ ఆ ప్రాజెక్టు పూర్తి కాలేద‌ని హిజ్‌బుల్లా సెక్ర‌ట‌రీ జ‌న‌ర‌ల్ షేక్ న‌యిమ్ ఖాసిమ్ తెలిపారు. ప్ర‌స్తుతం ఇరాన్‌, అమెరికా మ‌ధ్య శాంతి ఒప్పందం వాయిదా ప‌డ‌డంతో .. లెబ‌నాన్ ప‌రిస్థితి కూడా ఆగ‌మ్య‌గోచ‌రంగా మారింది. హిజ్‌బుల్లాపై ఇజ్రాయెల్ ప్ర‌ధాని నెత‌న్య‌హూ అనుచితంగా వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని గ‌తంలో ట్రంప్ ఆరోపించిన విష‌యం తెలిసిందే.
🏠 Home