🏠 netisudiksha.online
Watermark
Newspaper Logo
netisudiksha.online | Date: 20 Jun, 2026 | Page: 1

హైతీ ఆశ‌లు ఆవిరి.. 3-0 గోల్స్ తేడాతో బ్రెజిల్ విక్ట‌రీ

ఫిఫా వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో జ‌రిగిన గ్రూప్ సీ మ్యాచ్‌లో.. బ్రెజిల్ జ‌ట్టు విజ‌యం సాధించింది. 3-0 గోల్స్ తేడాతో హైతీపై విక్ట‌రీ కొట్టింది. బ్రెజిల్ ప్లేయ‌ర్ మాథ్యూస్ కున్హా రెండు గోల్స్ చేశాడు. మొరాకోతో జ‌రిగిన‌ ఓపెనింగ్ మ్యాచ్‌లో బ్రెజిల్‌పై విమ‌ర్శ‌లు వ‌చ్చాయి. ఆ మ్యాచ్ డ్రా కావ‌డంతో ప్లేయ‌ర్లు స‌రిగా ప‌ర్ఫార్మ్ చేయ‌లేద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో హైతీతో జ‌రిగిన మ్యాచ్‌లో బ్రెజిల్ ఆట‌గాళ్లు దూకుడు పెంచారు. ఆ జ‌ట్టులో వినిసియ‌స్ జూనియ‌ర్ మ‌రో గోల్ చేశాడు. స్ట్ర‌యిక‌ర్ ఇగోర్ థియాగో స్థానంలో ఆడిన కున్హా.. 23వ నిమిషంలోనే తొలి గోల్ చేశాడు. హైతీ డిఫెండ‌ర్ హ‌న్నెస్ డిల్‌క్రాక్స్‌కు బంతి త‌గిలి నెట్‌లోకి దూసుకెళ్లింది. వినిసియ‌స్ జూనియ‌ర్ ఇచ్చిన ఓ పాస్‌ను .. టాప్ కార్న‌ర్ షాట్‌తో కున్హా గోల్‌గా మ‌లిచాడు. ఫ‌స్ట్ హాఫ్ స్టాప్ చేసే స‌మ‌యంలో వినిసియ‌స్ జూనియ‌ర్ ఓ గోల్ కొట్టాడు. ఈ మ్యాచ్‌లో బ్రెజిల్ ప్లేయ‌ర్ రాఫినా గాయ‌ప‌డ్డాడు. అత‌ని స్థానంలో ర‌యాన్‌ను ఆడించారు. బ్రెజిల్ కీప‌ర్ అలిస‌న్ అద్భుతంగా చేశాడు. రెండో ఓట‌మితో ఈ టోర్నీ నుంచి హైతీ నిష్క్ర‌మించిన‌ట్లు అయ్యింది. గ్రూపు సీలో ఆ జ‌ట్టు ఇంకా ఖాతా తెర‌వలేదు.

🏠 Home